బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంత్ కుమార్ ఖాతాలు సదానంద గౌడ, నరేంద్ర థోమర్ లకు బదిలి: రాష్ట్రపతి ఓకే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన శాఖలను కేంద్ర ప్రభుత్వం మరో ఇద్దరు మంత్రులకు అప్పగించింది. అనంత్ కుమార్ నిర్వహిస్తున్న ఖాతాలను వేరే మంత్రులకు బదిలీ చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీ మనవి చెయ్యడంతో అందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్రవేశారు.

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఇంత కాలం రాసాయనాలు, ఎరువుల శాఖ, పార్లమెంట్ వ్యవహారాల శాఖలతో పాటు మరో రెండు శాఖల భాద్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. క్యాన్సర్ వ్యాదితో భాదపడుతున్న అనంత్ కుమార్ సోమవారం వేకువ జామున తుదిశ్వాస విడిచారు.

DV Sadananda Gowda, Narendra Tomar given Ananth Kumar’s portfolios

బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి డీవీ. సదానంద గౌడకు ఎరువులు, రసాయన శాఖలను అప్పగించారు. మరో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ కు పార్లమెంట్ వ్యవహారాల శాఖను అప్పగించారు.

ప్రస్తుతం నరేంద్ర సింగ్ థోమర్ గ్రామీణ, పంచాయితీ రాజ్ శాఖల భాద్యతలు నిర్వహిస్తున్నారు. వాటికి అదనంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖను అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం అనంత్ కుమార్ కు అప్పగించిన శాఖలు ఇక నుంచి సందానంద గౌడ, నరేంద్ర సింగ్ థోమర్ నిర్వహిస్తారు.

అనంత్ కుమార్ నిర్వహించిన శాఖలను కేంద్ర మంత్రులు సదానంద గౌడ, నరేంద్ర సింగ్ థోమర్ లకు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ పంపించిన లేఖకు మంగళవారం రాత్రి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

English summary
After the death of Ananth Kumar D.V.Sadananda Gowda assigned the additional charge of the ministry of Chemicals & Fertilizers. Narendra Singh Tomar assigned the additional charge of the ministry of Parliamentary Affairs in addition to their existing portfolios.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X