• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డయ్యర్.. మనిషి రూపంలో ఉన్న మృగం..! చచ్చేంత వరకూ పశ్చాత్తాపం వ్యక్తం చేయని దుర్మార్గుడు..!!

|

హైదరాబాద్ : ప్రపంచ క్రూరుల్లో జనరల్ డయ్యర్ ఒకరు. భారతదేశ సార్వౌభౌమాదికారాన్ని చేతుల్లోకి తీసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం డయ్యర్ ను బ్రిటిష్ సైన్యానికి కాంమాండెంట్ గా భారత్ పంపించింది. అప్పటి నుండి భారతీయులపై డయ్యర్ దురాగతాలు కొనసాగాయి. అమృత్‌సర్‌ ఘోర ఘటన తరువాత ఎటువంటి ఆందోళనలు జరగకుండా ఉండేందుకు కర్ఫ్యూ విధించాడు. కొన్నిప్రాంతాల్లో ప్రజలను వంద మీటర్ల దూరం వరకు పాకించేవాడు. చిన్నాపెద్ద అని తేడా లేకుండా అందరితో అలాగే చేయించాడు. ఇలా ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని చేసిన డయ్యర్‌కు కొందరు అనుకూలంగా మాట్లాడటం అందర్ని నివ్వెరపోయేలా చేసింది.

జలియన్‌వాలా బాగ్‌ ఓ నెత్తుటి మరక..! స్వాతంత్ర్య కాంక్షను రెట్టింపు చేసిన ఘటన..!!

 డయ్యర్ ఓ కిరాతకుడు..! ప్రజలను అత్యంత క్రూరంగా హింసించే వాడు..!!

డయ్యర్ ఓ కిరాతకుడు..! ప్రజలను అత్యంత క్రూరంగా హింసించే వాడు..!!

చుట్టూ ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. చివరి క్షణాల్లో ఉన్న ఒక బాధితుడు దాహం అని సైగ చేశాడు. వెంటనే పక్కన కాలువ నుంచి నీటిని తీసుకోని ఇవ్వాలని యత్నించాను. కాలువలో అనేక మృతదేహాలు పడివున్నాయి. వారిలో కొందరు ప్రాణాలతో ఉన్నారు. సైనికులు వెళ్లి పోయారా అని అడిగారు. వెళ్లారు అని చెప్పగానే వెంటనే పైకి వచ్చి ప్రాణభయంతో పారిపోయారు. మొత్తం పార్క్‌లో వందలాది మంది చనిపోయి ఉంటారు. జలియన్‌వాలా బాగ్‌ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సర్దార్‌ ప్రతాప్‌సింగ్‌ కాంగ్రెస్‌ విచారణ కమిటీ ముందు వెల్లడించిన సాక్ష్యమిది. భారత స్వాతంత్య్రోదమ చరిత్రలో ఒకేసారి వందలమంది అమాయకులను ఊచకోత కోసిన జనరల్‌ డయ్యర్‌ దీనిపై ఎప్పుడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. జలియన్‌వాలాబాగ్‌ ఊచకోత ఘటనకు నేటికి వందేళ్లు.

 ఆంక్షల మధ్య అంత్యక్రియలు..! కరుడుగట్టిన డయ్యర్ హ్రుదయం..!!

ఆంక్షల మధ్య అంత్యక్రియలు..! కరుడుగట్టిన డయ్యర్ హ్రుదయం..!!

ఏప్రిల్‌ 13, 1919న ఈ ఊచకోత జరిగింది. 14న అంతక్రియలు నిర్వహించేందుకు మృతుల బంధువులు అనుమతి కోరారు. అయితే బ్రిటిషు అధికారులు అంగీకరించలేదు. ఎలాంటి ఊరేగింపు లేకుండా మృతుడి కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొని మౌనంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. అక్కడక్కడ నిరసనలు వ్యక్తంచేస్తున్న వారిపై బ్రిటిషు దళాలు విరుచుకుపడ్డాయి. నగరంలో కొందరు గుమికూడగా అక్కడకు చేరుకున్న డయ్యర్‌ వారిని హెచ్చరించాడు. తాను సైనికుడినని.. ప్రజలకు శాంతి కావాలా, యుద్ధం కావాలా అని హెచ్చరిక జారీచేయడం అతడు ఎంత కఠినాత్ముడో వెల్లడిస్తోంది.

నరకాసుడికి బ్రిటిష్ ప్రభుత్వం సన్మానం..! సిగ్గు మాలిన చర్య..!!

నరకాసుడికి బ్రిటిష్ ప్రభుత్వం సన్మానం..! సిగ్గు మాలిన చర్య..!!

హంటర్‌ కమిషన్‌ డయ్యర్‌ చర్యలను తప్పుబట్టింది. వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించింది. బ్రిటన్‌కు చేరుకున్న డయ్యర్‌కు అప్పటి పత్రిక మార్నింగ్‌పోస్ట్‌ అండగా నిలిచింది. దాదాపు 26 వేలపౌండ్లను సేకరించి డయ్యర్‌కు అందజేసింది.

చివరిరోజుల్లో వ్యాధులతో పోరాడిన డయ్యర్..! దిక్కులేని చావు చచ్చిన ఉన్మాది..!!

చివరిరోజుల్లో వ్యాధులతో పోరాడిన డయ్యర్..! దిక్కులేని చావు చచ్చిన ఉన్మాది..!!

డయ్యర్‌ చివరిరోజులు భారంగా గడిచాయి. అనేక దీర్ఘవ్యాధులు అతన్ని చుట్టముట్టాయి. మానసిక రుగ్మత బాగా కుంగదీసింది. అమృత్‌సర్ కిరాతుకుడిగా, తాను అనుకున్నదే చేస్తానని ఢంకా బజాయించి చెప్పిన డయ్యర్‌ మృత్యువు ముందు ఓడిపోయాడు. 1927 అక్టోబరు 9న చనిపోయాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After the Amritsar sarrowful incident, the curfew was ordered to avoid any concerns. In some areas people would be sprung up to a hundred meters away. Dyer did all the same without distinction. Some of the dirty talk about how many evils this has done is to make everyone complacent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more