వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: మే 11 నుండి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ కూడ

ఈ -కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్డ్ , అమెజాన్ లు మరోసారి ధరల యుద్దంతో భారీ ఆఫర్లకు తెరతీయనున్నాయి. ఈ ఆఫర్ల యుద్దంలో వినియోగదారులకు ప్రయోజనం కలిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్ కతా: ఈ -కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్డ్ , అమెజాన్ లు మరోసారి ధరల యుద్దంతో భారీ ఆఫర్లకు తెరతీయనున్నాయి. ఈ ఆఫర్ల యుద్దంలో వినియోగదారులకు ప్రయోజనం కలిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 11నుండి 14 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో అమెజాన్ డిస్కౌంట్ల పండుగ ప్రారంభించనున్నాయి.

వినియోగదారులు ఇటీవలకాలంలో ఆన్ లైన్ లో కొనుగోళ్ళకు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు.అయితే ఈ కామర్స్ దిగ్గజాలు వినియోగదారులకు భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.

ఆన్ లైన్ ద్వార కొనుగోళ్ళ అవకాశం వినియోగదారులకు అందుబాటులోకి రావడంతో వినియోగదారులను ఆకట్టుకొనేందుకుగాను ఆయా ఈ కామర్స్ సంస్థలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. అయితే ఈ పోటీలో ప్రత్యర్థులకు అవకాశం లేకుండా చేసేందుకుగాను ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

బహుళజాతి కంపెనీ అమెజాన్ తన వినియోగదారులను ఆకట్టుకొనేందుకుగాను తరచుగా ఈ తరహా ఆఫర్లను ప్రకటిస్తోంది. అమెజాన్ పోటీని తట్టుకొనేందుకుగాను ఫ్లిప్ కార్ట్ కూడ ఆఫర్లను ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

10వ, వార్షికోత్సవం సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఆఫర్

10వ, వార్షికోత్సవం సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఆఫర్

ఈ నెల 14 నుండి 18 మధ్య ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించనున్నాయి. ఈ మేరకు ఈ రెండు కంపెనీలు వినియోగదారులకు పోటీలు పడి బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో అమెజాన్ డిస్కౌంట్ల పండగను ప్రారంభించనుంది. ఆ కంపెనీ సేల్ తుదిరోజు నుండి అంటే మే 14 వరకు బిగ్ 10 పేరుతో ఆఫర్ల వెల్లువకు ఫ్లిప్ కార్డు సిద్దం కానుంది.డీమానిటైజేషన్ దెబ్బకు రెవిన్యూలను కోల్పోయిన వ్యాపారాలకు ఈ వార్షికోత్సవం వరంగా మారనుంది.

80 శాతం డిస్కౌంట్లను ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

80 శాతం డిస్కౌంట్లను ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

ఆన్ లైన్ సేల్స్ లో తమ మార్కెట్ ప్లేస్ లోని ఉత్తత్తులకు లీడింగ్ బ్రాండ్స్ కు 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది. ఫ్లిప్ కార్ట్. ఈ ఆఫర్లతో తమ రెవెన్యూలను మూడు నుండి నాలుగింతలు పెంచుకోవాలని నిర్ణయించినట్టు ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

అమెజాన్ కూడ ఆఫర్ల వెల్లువ

అమెజాన్ కూడ ఆఫర్ల వెల్లువ

గ్రేట్ ఇండియా సేల్ పేరుతో గతంలో ఎన్నడూ లేని విధంగా వెయ్యికిపైగా బ్లాక్ బస్టర్ డీల్స్ ను ఆఫర్ చేయనున్నట్టు గ్లోబల్ దిగ్గజం అమెరికా పేర్కొంది. విక్రయదారులు తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేయాలని ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.అమెజాన్ ఆఫర్లు ఈ నెల 11 నుండి 14 వరకు కొనసాగనున్నాయి.

డిజిటల్ పేమెంట్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు

డిజిటల్ పేమెంట్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు

డిజిటల్ పేమెంట్లకు అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడ అందించాలని ఈ కామర్స్ సంస్థలు నిర్ణయించాయి. ఫ్లిప్ కార్ట్ స్వంతం చేసుకొన్న మరో ఆన్ లైన్ వెబ్ సైట్ మంత్రా సైతం ఈ సమయంలోనే మెగా డిస్కౌంట్ సేల్ ను ప్రారంభించనుంది. తన పదవవార్షికోత్సవంలో భాగంగా భారీ మొత్తంలో డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిఫ్ కార్ట్ తెలిపినట్టు టాప్ ఆన్ లైన్ సెల్లర్ తెలిపింది. మే 2 నుండి నిన్నటిదాకా ఫ్లిప్ కార్ట్ సమ్మర్ షాపింగ్ డేస్ పేరిట భారీ ఆఫర్లను కస్టమర్లను అందించింది.

English summary
Amazon and Flipkart, the two largest e-commerce players in the market have two mega sale events lined up for this month. The sale events will give users discounts on the selling prices of the products available in the product catalog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X