వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత గడ్డపై అడుగు పెట్టబోతూ: ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచే.. హిందీలో ట్వీటిన ట్రంప్..!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: మరి కొన్ని నిమిషాలు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ భారత పర్యటన ఆరంభం కాబోతోంది. భారత గడ్డ మీద ఆయన కాలుమోపబోతున్నారు సతీ సమేతంగా. సరిగ్గా- 11:30 గంటలకు ఆయన గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతార్జతీయ విమానాశ్రయంలో దిగబోతున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతించడానికి కేంద్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.

భారత గడ్డ మీద అడుగు పెట్టడానికి గంటన్నర ముందు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు.. హిందీలో. భారత పర్యటన కోసం తాను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం తాను దారి మధ్యలో ఉన్నానని, కొన్ని నిమిషాల్లో భారత్‌లో అడుగు పెట్టబోతున్నానని చెప్పారు. భారతీయులను కలుసుకోబోతున్నానని రాసుకొచ్చారు. ఈ ఉదయం 10:13 నిమిషాలకు ట్రంప్.. తన అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి ఈ ట్వీట్ చేశారు.

Eager To Visit India, Donald Trump Tweets In Hindi Ahead Of Visit

కాగా- డొనాల్డ్ ట్రంప్‌కు కనివినీ ఎరుగని రీతిలో స్వాగతం పలకబోతున్నాయి కేంద్రం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు. దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. గుజరాతీ సంప్రదాయ కళాకారులతో స్వాగతం పలకబోతున్నాయి. విమానాశ్రయం నుంచి మొతెరా వరకు నిర్వహించబోతున్న రోడ్ షో కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసింది. రోడ్ షో సందర్భంగా దారి పొడవునా గుజరాతీ సంప్రదాయ నృత్యాలు, పాశ్చాత్య కళాకారులు, మల్లఖంబా ప్రదర్శనలను ఏర్పాటు చేసింది గుజరాత్ ప్రభుత్వం.

హౌడీ మోడీ తరహాలో మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి డొనాల్డ్ ట్రంప్.. ఈ రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. జాతిపిత మహాత్మాగాంధీకి చెందిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. దీనికోసం నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందటే అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ, ఆయన మంత్రివర్గ సహచరులు మోడీకి స్వాగతం పలికారు.

English summary
Just ahead of his arrival in India, US President Donald Trump tweeted in Hindi saying he is eager to visit India. In the tweet in Hindi, he said: Ham Bharat aane ke liye tatpar hain. Ham Raste me hain. Kuchh hi ghanton me hum sabse milenge. The tweet if translates in Hindi will read like: We are eager to visit India. We are on the way. In a few hours, we will meet you all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X