వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్కువ సంపాదించు, ఎక్కువ పన్ను కట్టు,, ఇదే నిర్మలా తారకమంత్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో చెప్పినట్టుగానే వేతన జీవులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరట కలిగించారు. రూ.5 లక్షల లోపు వేతన జీవులకు పన్ను పోటు ఉండదని స్పష్టంచేశారు. కానీ రూ.2 కోట్ల కన్నా ఎక్కువ సంపాదించే వారికి మాత్రం పన్ను పోటు భారీగా విధించారు. ఎక్కువ సంపాదించేవారికి .. ఎక్కువగానే ట్యాక్స్ వేశారు నిర్మలా.

రెండింతల సర్‌చార్జీ
భారీగా ఆదాయం గడించే వారికి సర్ చార్జీ రెండింతలు వడ్డించారు. ఓ వ్యక్తి వ్యక్తిగతంతో రూ.5 కోట్లు సంపాదిస్తే అతను 7 శాతం పన్ను కట్టాల్సిందేనని స్పష్టంచేశారు. ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కూడా వేతన జీవులకు ఊరట కలిగించారు. రూ.5 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను విధించలేదు. మిగతా స్లాబులన్నీ యథాతథాంగా ఉంచారు. దీంతోపాటు 80 సీ కింద రూ. లక్షన్నర వరకు మినహాయింపు కల్పించారు. పబ్లిక్ ప్రావిడెంట్‌ విభాగంలో కొంత పెట్టుబడి పెట్టాలని సూచించారు. లేదంటే పిల్లల చదువు, స్టాంపు డ్యూటీ, ఇల్లు రిజిస్ట్రేషన్ తదితర ఖర్చులు చూపించాలని కోరారు. దీంతోపాటు రూ.50 వేలను నేషనల్ పెన్సన్ స్కీం కింద చూపించొచ్చని పేర్కొన్నారు.

Earn more pay more, Sitharaman tells crorepati taxpayers

ఐటీ రిటర్న్స్ తప్పనిసరి ..
రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు నిర్మలా సీతారామన్. కానీ వారు ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ తప్పనిసరిగా ఫైల్ చేయాలని సూచించారు. లేదంటే ఐటీ విభాగం నోటీసులు జారీచేస్తుందని తేల్చిచెప్పారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను విధించారు. దీంతో వారికి రూ.లక్ష వరకు పన్ను రాయితీ కలుగుతుందని తెలిపారు. రూ. 10 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను విధిస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు 4 శాతం సెస్ కూడా విధిస్తామని తెలిపారు.

English summary
stating that those earning more should contribute more, Union Finance Minister Nirmala Sitharaman announced two rates of surcharge on rich tax payers. Sitharaman proposed to enhance the surcharge of three per cent on individual having taxable income between Rs 2 crore and Rs 5 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X