వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్జీతో సంపాదన ... ఆడుకున్నోళ్ళకు ఆడుకున్నంత

|
Google Oneindia TeluguNews

పబ్జీ ... యువత భవిష్యత్తును పాడు చేస్తూ, ప్రాణాలు తీస్తున్న ఆటగానే మనకు తెలుసు. కానీ పబ్జీ ఆటతో కూడా డబ్బు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు కొందరు యువకులు. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి.

పబ్జీ గేమ్ ఆడొద్దు అంటుంటే ... 14 కోట్ల ప్రైజ్ మనీ పెట్టారు ...ఇంకా ఊరుకుంటారా !పబ్జీ గేమ్ ఆడొద్దు అంటుంటే ... 14 కోట్ల ప్రైజ్ మనీ పెట్టారు ...ఇంకా ఊరుకుంటారా !

పబ్జీ ఆటను లైవ్ స్ట్రీమ్ చేసి సంపాదన

పబ్జీ ఆటను లైవ్ స్ట్రీమ్ చేసి సంపాదన

పబ్జీ ఆటతో ఓ యువకుడు అక్షరాల నెలకు 50000 సంపాదిస్తున్నారు. అంటే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీరు ఆడుతున్న ఆట దాదాపు వేల మంది చూస్తున్నారు. ఎలా ఆడుతున్నారని దానిపై కామెంట్ కూడా పెడుతున్నారు . అంతేకాదు లెవెల్ కంప్లీట్ చేస్తే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందుకే ఆ యువకుడు ఈ గేమ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చని భావించి ఆట ఆడటం మొదలు పెట్టాడు. ఈ పబ్జీ వాలా .. రాత్రి 9 అయితే చాలు, పచ్చి గేమ్ ఆడటం మొదలు పెడతాడు. అర్ధరాత్రి రెండు గంటల వరకు చాలా సీరియస్ గా గేమ్ ఆడతాడు. రిషబ్ కరణ్ వాల్ అనే ఈ యువకుడు ఏదో ఊసుపోకనో , ఆటకు అడిక్ట్ అయ్యో పబ్జీ ఆడడం లేదు. డబ్బు సంపాదించాలని గేమ్ ఆడుతున్నాడు. ఇక రిషబ్ తరహాలో చాలామంది పబ్జీ గేమ్ ను లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. యూట్యూబ్, ట్విచ్, ఆడియన్స్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు.

ఇండియా గేమింగ్ అవార్డ్స్ లో స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న పబ్జీవాలా

ఇండియా గేమింగ్ అవార్డ్స్ లో స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న పబ్జీవాలా

ఇండియా గేమింగ్ అవార్డ్స్ 2018 లో రిషబ్ కరణ్ వాల్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. రిషబ్ గేమ్స్ ఆడు 2016లో మొదలుపెట్టి ప్రస్తుతం దీని ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఈ అవార్డును అందుకున్నాడు. ముందు ఇంట్లో వాళ్ళందరూ గేమ్స్ కోసం వేలకువేలు తగలేస్తున్నారు అని రిషబ్ ని బాగా తిట్టే వారట. కానీ ఇవేవీ పట్టించుకోని రిషబ్ ఇప్పుడు నెలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా 50 వేల రూపాయలు కేవలం పబ్జీ గేమ్ తో సంపాదిస్తున్నారు అంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

యాంటీ సోషల్ ఎలిమెంట్ గా పబ్జీ ... కానీ డబ్బు సంపాదించవచ్చు అంటున్న యువత

యాంటీ సోషల్ ఎలిమెంట్ గా పబ్జీ ... కానీ డబ్బు సంపాదించవచ్చు అంటున్న యువత

ఈ పబ్జీ గేమ్ ను యాంటీ సోషల్ ఎలిమెంట్ గా భావిస్తున్న తరుణంలో, యువత అడిక్షన్ కు
గురవుతుందని తల్లిదండ్రుల నుండి ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో కూడా ఈ గేమ్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకపక్క పబ్జీ గేమ్ మోజులో పడి యువత ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నా ఈ రకంగా ఆడటమే కాకుండా, ఈ ఆట ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు అంటే ఆడకుండా ఊరుకుంటారా చెప్పండి. పబ్జీ గేమ్ ద్వారా డబ్బు సంపాదన విషయం అటుంచితే, ఈ గేమ్ పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

English summary
A young man earns 50000 rupees a month with a popular online game PabG .The youth who earn money through the online streaming of the game and earn money through PabG .It is said that the whole country is opposing the game and a demand to ban the game . but some of the palyers are playing Pabg for money .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X