వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

EARTH QUAKE IN POK : మంగళ డ్యాంకు తప్పిన ముప్పు..

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో వచ్చిన భూ ప్రకంపనాలతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత నమోదవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతుంది. పీవోకేలోని న్యూ మిర్‌సిటీ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మిర్‌సిటీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలపై భూకంపం ప్రభావం చూపింది. జమ్ము కశ్మీర్, పంజాబ్, హర్యానాలో కూడా భూమి కంపించింది.

భూకంపంతో పీవోకేలోనే ఎక్కువగా నష్టం వాటిల్లింది. దీంతోపాటు ఒకింత ఊరట పొందు విషయం కూడా ఉంది. మిర్‌సిటీకి సమీపంలో మంగళ డ్యాం ఉంది. దీనిని జీలం నదిపై నిర్మించారు. ప్రపంచంలోనే ఏడవ అతి పెద్ద డ్యాం కూడా. ఒకవేళ భూ ప్రకంపనాల తీవ్రతతో డ్యాంకు బీటలు బారితే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. డ్యాం కింద ఉన్న పరివాహక గ్రామాలు, పట్టణాలు నీట మునిగిపోయే పెను ప్రమాదం ఉండేది. దీంతో ఆస్తినష్టం కాదు .. ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉండేది.

EARTH QUAKE IN POK : MANGLA DAM IS SAFE

భూ ప్రకంపనాలు మిర్‌సిటీ, జమ్ముకశ్మీర్, పంజాబ్, ఢిల్లీ మీద ప్రభావం చూపాయి కానీ .. మంగళ డ్యాం వద్ద ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు. దీంతో అక్కడున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు భూకంపంతో రహదారులు నిట్టనిలువునా చిలీపోయాయి. భవనాలు కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే 15 మంది చనిపోయారు. ఓ భవంతి కూలి ఐదుగురు చనిపోగా .. అందులో 50 మంది చిక్కుకున్నారు. దీంతో పాకిస్థాన్ ఎమర్జెన్సీ ప్రకటించి .. ఆర్మీని రంగంలోకి దింపింది.

English summary
New Mirpur city showed damage to roads and vehicles. Photographs showed cracked roads and overturned vehicles in the region following the earthquake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X