వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు

|
Google Oneindia TeluguNews

అరుణాచల్ ప్రదేశ్: ఈశాన్య భారతంలో భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. తెల్లవారుజామున 1.45 గంటలకు భూమి కపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించడంతో దీని ప్రభావం అస్సాం, చైనా సరిహద్దులు, టిబెట్, మయన్మార్‌లలో కనిపించింది. అలాంగ్‌కు ఆగ్నేయ దిశలో 40 కిలోమీటర్ల దూరంలో, రాజధాని ఈటానగర్‌కు నైరుతీ దిశలో 180 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భారత భూకంపకేంద్రం మాత్రం అరుణాచల్ ప్రదేశ్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ఇదిలా ఉంటే పొరుగుదేశం నేపాల్‌లోని ఖాట్మండులో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైంది. ధాడింగ్ జిల్లా నౌబైస్‌లో రెండు సార్లు భూమి కంపించింది. తొలిసారిగా ఉదయం 6:29 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. రెండో సారి కొన్ని నిమిషాల వ్యవధిలోనే అంటే 6:40 గంటలకు సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది. నేపాల్‌లో భూమి కంపించడంతో దీని ప్రభావం టిబెట్, ఇతర భారత సరిహద్దు రాష్ట్రాల్లో కనిపించిందని చైనా ప్రభుత్వ వార్త ఛానెల్ పేర్కొంది.

Earth quake with 6.1 magnitude hits Arunachal Pradesh,Tremors felt in Assam

ఇదిలా ఉంటే భారత్ చైనాల మధ్య అరుణాచల్ ప్రదేశ్‌పై కొన్ని దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దీనికి ఒక పరిష్కారం కనుగొనలేదు. అరుణాచల్ ప్రదేశ్‌ను ఈశాన్యరాష్ట్రంగా భారత్ పరిగణిస్తుండగా... అందులో 90వేల చదరపు కిలోమీటర్ల మేరా భూభాగం చైనాకు చెందుతుందని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌ మయన్మార్, భూటాన్ దేశాలకు సరిహద్దులో ఉంది.

English summary
A strong 6.1-magnitude earthquake struck India's northeastern state of Arunachal Pradesh early Wednesday, the US Geological Survey said. The tremors were felt across Assam and parts of bordering China, Tibet and Myanmar. It struck at 1.45 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X