ఢిల్లీలో భూ ప్రకంపనలు: జనం పరుగులు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బుధవారం రాత్రి ఢిల్లీలో బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు 121 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

 Earthquake of 5.0 magnitude strikes Uttarakhand, tremors felt in Delhi-NCR

గురుగ్రామ్, హరిద్వార్, అల్మోరా, రామ్‌నగర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రాత్రి 8.49గంటలకు ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కాగా, భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. ఇది ఇలా ఉండగా, ఉత్తరాఖండ్‌లోని ఛమోలీతోపాటు తమిళనాడు రాజధాని చెన్నైలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ఢిల్లీలో భూ ప్రకంపనల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లోని జనాలు బయటికి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇంతకుముందు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్, రాపార్ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Strong earthquake tremors were felt in Delhi on Wednesday night. However, initial reports suggested that the epicentre of the earthquake was in Uttarakhand.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X