వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదైంది. బుధవారం ఉదయం 8.01 గంటలకు భూమి కంపించిందని అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రాన్ని తజకిస్థాన్ లోని కోఫర్నిహన్ గా గుర్తించింది. భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నదని పేర్కొన్నది. ప్రకంపనాలు మహారాష్ట్ర తీరం వరకు వెళ్లి ఉంటాయని అంచనా వేసింది.

ఇండోనేషియాలో 5.6

ఇండోనేషియాలో 5.6

ఇటు ఇండోనేషియాలో కూడా భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.6గా రికార్డైందని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రాన్ని కోట టెర్నెట్ గా గుర్తించారు. 36.4 కిలోమీటర్ల లోతు వరకు భూకంప తీవ్రత ఉన్నదని తెలిపారు.

8న 5.6 తీవ్రతతో ..

8న 5.6 తీవ్రతతో ..

ఈ నెల 8న కూడా ఢిల్లీలో భూకంపం వచ్చింది. అప్పుడు దాని తీవ్రత 5.6గా రికార్డైందని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనాలతో ఢిల్లీ రాజధాని ప్రాంతం, ఇతర ఉత్తర భారతదేశం, జమ్ముకశ్మీర్ లో కూడా ప్రకంపనాలు వచ్చినట్టు పేర్కొన్నారు.

కశ్మీర్ లో 5.1

కశ్మీర్ లో 5.1

జమ్ము కశ్మీర్ లో సోమవారం వచ్చిన భూకంప తీవ్రత 5.1గా అధికారులు వెల్లడించారు. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనాలు వచ్చినట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. అయితే ఈ భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని వివరించింది.

English summary
Earthquake tremors measuring 4.6 on the Richter Scale was felt across Delhi-NCR and other parts of North India at 8.01 am on Wednesday. The epicentre of the earthquake was 4 km off Kofarnihon in Tajikistan, according to the United States Geological Survey (USGS). The depth of the quake is said to be 10 km, as per USGS reports. Unconfirmed reports say that tremors were felt as far as Maharashtra coastline.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X