వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో స్వల్ప భూప్రకంపనలు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : గుజరాత్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. గత రాత్రి 10.30గంటల సమయంలో గుజరాత్ తూర్పు భాగంలో ప్రకంపనలు నమోదయ్యాయి. బనస్‌కాంతతో పాటు దాని పరిసర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.

రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదైంది. పలన్‌పూర్‌కు ఈశాన్యంగా 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలాజికల్ రీసెర్చ్ అధికారులు ప్రకటించారు.

Earthquake Hits Parts Of North Gujarat

భూ ప్రకంపనల కారణంగా సబర్‌కాంతవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు మెహ్‌సానా జిల్లా, రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో స్వల్ప భూ ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు చెప్పారు.

English summary
A magnitude 4.3 earthquake shook parts of Banaskantha and adjoining districts in north Gujarat Wednesday night, though no damage to property or casualties were reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X