వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లఢఖ్‌లో భూకంపం: కార్గిల్ సమీపంలో భూకంప కేంద్రం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. కార్గిల్ వాయూవ్యంలో 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇది భూ ఉపరితలానికి 25 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది.

ఇప్పటి వరకు భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. శుక్రవారం రాత్రి 8.15 గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు.

Earthquake in Ladakh, epicentre near Kargil

కాగా, శుక్రవారం మేఘాలయా రాష్ట్రంలో కూడా భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. మేఘాలయాలోని తురకు పశ్చిమాన 79 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.

దేశ రాజధాని ప్రాంతంలో కూడా 2.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. హర్యానాలోని రోహ్తక్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలి కాలంలో ఉత్తర భారతదేశంతోపాటు ఈశాన్య భారతదేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తుండటం గమనార్హం.

English summary
Earthquake has jolted Ladakh. Magnitude of the earthquake has been measured to be 4.5 on the Richter scale. The epicentre is located 200 km Northwest of Kargil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X