మహారాష్ట్రలో భూకంపం .. పరుగులు తీసిన జనం ...
సాతారా : మహారాష్ట్రలో స్వల్పంగా భూమి కంపించింది. సాతారా జిల్లాలో కొన్నిచోట్ల ప్రకంపనాలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.8గా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు.
భయాందోళన ..
సాతారా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. దీంతో జనం కాస్త భయాందోళనకు గురయ్యారు. అయితే తీవ్రత తక్కువ ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఆస్తి నష్టం కూడా జరగలేదని జిల్లా అధికారులు పేర్కొన్నారు. భూమి కంపించడంతో కొన్ని చోట్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఉదయం 7.27 గంటలకు మొదట భూమి కంపించిందని .. తర్వాత 8.27 గంటలకు ప్రకంపనాలు రికార్డయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపాలకు సంబంధించి భూకంప కేంద్రం 5 నుంచి 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపించిందని తెలిపారు. అయితే స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు పెద్దగా ఆందోళన చెందలేదని పుణెకి చెందిన వాతావరణ విభాగ శాస్త్రవేత్త అరుణ్ మీడియాకు తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!