వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర భారతంలో భూకంపం.. ఢిల్లీలో కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఉత్తర భారత దేశంలో భూమి కంపించింది. దేశ రాజధాని ఢిల్లీలో పలు చోట్ల భూమి కంపించింది. ఢిల్లీతో పాటు జమ్మూ కశ్మీర్, పంజాబ్, హర్యానాలో కూడా భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాలు ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మధ్యాహ్నం 4:30 గంటలకు భూకంపం వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు సమాచారం. ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకున్న సమయంలోనే పాకిస్తాన్‌లో కూడా భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. భూకంపంకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇండో పాక్ సరిహద్దు కేంద్రంగా ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌లో భూకంపం బారిన పడి ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది అయితే భారత్‌లో మాత్రం ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు . ఇళ్లల్లో వస్తువులు కదులుతుండటంతో గ్రహించిన ప్రజలు భూకంపం వస్తుందని భావించి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.

Earthquake in North India: People goes panic

English summary
Earthquake in North India: Tremors were felt in Delhi/NCR for several seconds on Tuesday afternoon at around 4:35 pm. No casualities reported so far. full details yet to come.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X