వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో భూకంపం: 43గా తీవ్రత నమోదు
దిగ్లీపూర్: అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టారుస్కేలుపై 4.3 గా నమోదైంది. ది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం దిగ్లీపూర్ 55 కిలోమీటర్ల దూరంలో సంభవించింది.

10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. రాత్రి 7.05 గంటల సమయంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. భూకంపం సంభవించడంతో జనం తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.