వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్: రాజ్‌కోట్ సహా పలు ప్రాంతాల్లో భూకంపం, జనం పరుగులు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రాజ్‌కోట్, కచ్, సౌరాష్ట్ర, అహ్మదాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రాజ్‌కోట్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా ఆదివారం రాత్రి 8.13 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.

Recommended Video

Gujarat Earthquake : పలు ప్రాంతాల్లో భూకంపం, ప్రజలు పరుగులు Video

రిక్టారు స్కేలుపై 5.8గా భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కాగా, భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

 Earthquake of 5.5 magnitude hits Gujarats Rajkot, Saurashtra and Ahmedabad

భూకంపం సంభవించినట్లు తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజ్ కోట్, కచ్, పఠాన్ జిల్లాల కలెక్టర్లతో ఫోన్ చేసి మాట్లాడారు. పరిస్థితిపై సమీక్షించారు.

ఇది ఇలావుంటే, టర్కీలో కూడా 20 నిమిషాలపాటు భూకంపం సంభవించినట్లు తెలిసింది.

English summary
An earthquake of magnitude 5.5 on richer scale struck several parts of Gujarat, including Rajkot and Kutch at 8:13 pm on Sunday, reported National Center for Seismology (NCS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X