వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాదిని వణికించిన భూకంపం: ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో శుక్రవారం సాయంత్రం భూ ప్రకంపనలు నమోదయ్యాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో సంభవించిన భారీగా భూకంపం తీవ్రత ప్రభావం వల్ల ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో వాటి ప్రకంపనలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. హిందూకుష్ పర్వత శ్రేణులను భూకంప కేంద్రంగా గుర్తించారు. దాని తీవ్రత 6.8గా నమోదైనట్లు వెల్లడించారు.

పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, రావల్పిండి, ఖైబర్ ఫక్తున్ ఖ్వా సహా పలు జిల్లాల్లో మధ్యాహ్నం దాటిన తరువాత భూకంపం సంభవించింది. ఆ భూకంప ప్రకంపనల తీవ్రత ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్, న్యూఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎసీఆర్) పరిధిలోని చాలా ప్రాంతాల్లో భూమి స్వల్పంగా ప్రకంపించింది. హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమికి కంపించినట్లు తెలుస్తోంది.

earthquake of 6.8 magnitude in Hindukush region, tremors in Northern parts of india including Delhi-NCR

ఆయా ప్రాంతాల్లో సుమారు 25 సెకెన్ల పాటు భూమి కంపించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో అపార్ట్ మెంట్ వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉరుకులు, పరుగులతో తమ ఫ్లాట్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రదేశానికి తరలి వెళ్లారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్ల లేదని ప్రాథమిక అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. హిందుకుష్ పర్వత శ్రేణుల్లో గానీ, పాకిస్తాన్, ఆఘ్ఘనిస్తాన్ లల్లో ఎలాంటి నష్టం సంభవించిందనేది తెలియరావాల్సి ఉంది.

English summary
A 6.8 magnitude earthquake jolted Hindu Kush area in Afghanistan and tremors were felt in several parts of North India, including Delhi-National Capital Region. There were no immediate reports of damage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X