వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

|
Google Oneindia TeluguNews

మూడు రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. బెంగాల్, బీహర్, జార్ఖండ్ రాష్టాల్లో ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.8గా నమోదైంది. బీహార్‌ బాంకా పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 సెకన్ల పాటు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. జార్ఖండ్‌లోని ధన్బాద్, సంతాల్ కోయలాంచల్‌లో భూమి కంపించింది. ఉదయం 10.39గంటలకు భూకంపం వచ్చినట్లు ఐఐటీ అబ్జర్వేటరీ సెంటర్ గుర్తించింది. స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

ఇదిలా ఉంటే అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూమి కంపించింది. ఉదయం 7.49 గంటలకు వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. గత కొన్ని రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లో తరుచూ భూకంపాలు వస్తున్నాయి. శనివారం తెల్లవారు జామున నికోబార్ దీవుల్లో 5.0, 4.8 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారుల తెలిపారు.

earthquake of magnitude 4.8 on the richter scale struck Three states

అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున 2.52గంటలకు వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. ఉదయం 5గంటలకు వచ్చి భూ ప్రకంపనలు 4.8గా రికార్డయ్యాయి. ఈ రెండు భూకంప కేంద్రాలు భూమికి 10కిలోమీటర్ల లోతున ఉన్నట్లు గుర్తించారు. భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు. సునామీ వచ్చే అవకాశమేమీ లేదని అధికారులు ప్రకటించారు.

English summary
earthquake of magnitude 4.8 on the richter scale struck parts of West Bengal and Jharkhand on Sunday. The tremors were first reported in Bankura on Sunday morning. Subsequently tremors were reported in neighbouring regions as well. No damage to properties or casualties were reported in mild-intensity quake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X