వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : హిమానీనదం జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.2గా నమోదైంది. దీంతో ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు. భూ ప్రకంపనాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 4.20 గంటలకు భూమి కంపించినట్టు స్థానిక అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూకంపంతో అప్రమత్తమయ్యామని పేర్కొన్నారు.

Earthquake with 4.2 magnitude rocks Jammu and Kashmir

లేహ్‌లోని పర్వతప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. స్వల్ప భూకంపంతో ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదు. ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు అందలేదని అధికారులు వివరించారు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటనలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 9న ఇండో నేపాల్ సరిహద్దులో భూమి కంపించిన సంగతి తెలిసిందే. అప్పుడు 4.6 తీవ్రతతో భూమి కంపించింది. కొద్దిరోజుల్లోనే మళ్లీ భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతన్నారు. భూ ప్రకంపనాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

English summary
an earthquake measuring 4.2 on the Richter scale rocked Jammu and Kashmir region on Tuesday. The tremors were felt at around 04:20 pm. The epicentre of the quake was in the mountains near Leh. No reports of injuries or casualties so far. More details awaited. Earlier on August 9, an earthquake measuring 4.6 on the Richter scale had hit Indo-Nepal border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X