వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ దేశంలోనే బీఫ్ తినేసి.. భారత్‌కు రండి: కేంద్రమంత్రి అల్ఫోన్స్

భారత్‌కు వచ్చే పర్యాటకులు తమ దేశాల్లోనే బీఫ్‌ తినేసి రావాలని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ సూచించారు.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: భారత్‌కు వచ్చే పర్యాటకులు తమ దేశాల్లోనే బీఫ్‌ తినేసి రావాలని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ సూచించారు. ఆహారం విషయంలో ఏ రాష్ట్రానికి నిబంధనలు లేవని ఇటీవల కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ చెప్పిన విషయం తెలిసిందే. కేరళ, గోవా లాంటి రాష్ట్రాల్లో ప్రజలు బీఫ్‌ తినొచ్చని కూడా మంత్రి తెలిపారు.

అయితే, తాజాగా అదే మంత్రి బీఫ్‌పై మరోసారి అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్‌కు వచ్చే పర్యాటకులు తమ దేశాల్లో బీఫ్‌ తినేసి రావాలని ఆల్ఫోన్స్‌ సలహా ఇచ్చారు. ఇటీవల గో సంరక్షణ పేరుతో దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

Eat beef in your own country and then come to India: K J Alphons

ఈ నేపథ్యంలో భారత పర్యాటకంపై ఈ ఘటనలు ప్రభావాన్ని చూపించాయా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమివ్వడం గమనార్హం.
'పర్యాటకులు తమ దేశంలో బీఫ్‌ తిని ఆ తర్వాత భారత్‌కు రావాలి' అని ఆల్ఫోన్స్‌ చెప్పారు.

అయితే ఇటీవల బీఫ్‌పై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా.. 'నేను ఆహార మంత్రిని కాను. పర్యాటక మంత్రిని మాత్రమే' అని చెప్పారు. 'మన దేశానిది అతి పురాతనమైన నాగరికత. ప్రపంచం మొత్తం మన దేశానికి వచ్చి ఇక్కడి అందాలను చూడాలి. అందుకు తగ్గట్లుగా టూరిజంను అభివృద్ధి చేస్తాం' అని చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి అల్ఫోన్స్.

English summary
Union Minister, K J Alphons has a suggestion to those who want to eat beef. He says those foreigners visiting India must eat beef in their own country and then come here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X