• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్రమంత్రుల ఉవాచ: ఈమని శంకర శాస్త్రి వీణానాదాన్ని వినండి..క్యారెట్లను దండిగా తినండి!

|

న్యూఢిల్లీ: ప్రీవెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.. అనేది వైద్యశాస్త్రంలో అందరికీ తెలిసిన ఓ బేసిక్ ఫార్ములా. రోగం వచ్చిన తరువాత నయం చేసుకోవడం కంటే.. అది రాకుండా జాగ్రత్త పడాలనేది దాని సారాంశం. ఇద్దరు కేంద్రమంత్రులు జాయింట్ గా ఇదే ఫార్ములాను ఫాలో అవాలంటూ ఢిల్లీ జనాలకు ఉచిత సలహాలను ఇస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల సంభవించే రోగాల బారిన పడకుండా ఉండటానికి ప్రఖ్యాత తెలుగు వీణా విద్వాంసుడు ఈమని శంకర శాస్త్రి వీణానాదాన్ని వినాలని ఒకరు.. క్యారెట్లను తినాలని ఇంకొకరు అడక్కుండానే కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆ ఇద్దరు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.

హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టానన్నావ్..ఇండియా మ్యాప్ లో అమరావతి ఏదీ?: బీజేపీ

కొద్దిరోజులుగా దేశ రాజధానిలో వాయు కాలుష్యం ఏ రేంజ్ లో ఉంటూ వస్తోందో తెలుసు. అక్కడి ప్రజలు పీల్చుతున్నది ప్రాణవాయువు కాదంటూ ఏకంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని సైతం విధించారు. పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. వాతావరణంలో వెలుతురు సైతం సరిగ్గా ప్రసరించలేదంటే.. వాయు కాలుష్యం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విమానాలను సైతం దారి మళ్లించాల్సి పరిస్థితి ఢిల్లీలో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని నియంత్రించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ మొర పెట్టుకుంటున్న ఢిల్లీ వాసులకు కేంద్ర మంత్రులు ఇస్తోన్న ఉచిత సలహాలు మరింత మంటెక్కిస్తున్నాయి.

Eat Carrots, Listen To Music: Union Ministers Javadekar and Harshavardhan Tweet on Delhi Air Pollution

ఈమని శంకర శాస్త్రి వీణానాదాన్ని వినాలని, ఫలితంగా వాయు కాలుష్యానికి సంబంధించిన రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చని ప్రకాశ్ జవదేకర్ చెప్పుకొచ్చారు. సుమారు రెండు నిమిషాల పాటు ఉన్న ఈమని శంకర శాస్త్రి వీణానాదానికి సంబంధించిన ఓ యుట్యూబ్ లింక్ ను ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అదే సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కూడా అలాంటి ట్వీట్ ను ఒకటి పోస్ట్ చేశారు. క్యారెట్లను దండిగా తినాలని సూచించారు. వాయు కాలుష్య సంబంధ రోగాలు రాకుండా క్యారెట్లు అద్భుతంగా పనిచేస్తాయని చెప్పుకొచ్చారు.

Eat Carrots, Listen To Music: Union Ministers Javadekar and Harshavardhan Tweet on Delhi Air Pollution

విటమిన్-ఎ, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ క్యారెట్లలో పుష్కలంగా ఉంటాయని వాటిని తినడం వల్ల రేచీకటి వ్యాధిని, కాలుష్య కారక రోగాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చని సూచించారు. ఇప్పటికే కాలుష్యం దెబ్బకు ఊపిరి తీసుకోలేనంతగా ఇబ్బందులకు గురి అవుతున్న ఢిల్లీ వాసులకు ఈ ఇద్దరు కేంద్రమంత్రులు కూడబలుక్కుని ఇచ్చిన సలహాలు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయో.. ఏమో.. కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. కుప్పలు తెప్పలుగా ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు.. తమ ట్వీట్ల ద్వారా.

English summary
As Delhi struggles with its worst air pollution crisis of the year, two tweets by union ministers on Sunday triggered a wave of criticism online. While Union Environment Minister Prakash Javadekar's post was a music recommendation, Health Minister Dr Harsh Vardhan suggested eating carrots as one of the ways to counter pollution-related health problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X