• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్ -రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై ఈసీ నిషేధం

|

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊపుమీదున్న బీజేపీకి షాక్ తగిలింది. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌పై ఎన్నికల సంఘం 24 గంటల పాటు నిషేధం విధించింది. 24 గంటల పాటు ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఈ నిబంధన గురువారం రాత్రి 7 గంటల నుంచి శుక్రవారం రాత్రి 7 గంటల వరకూ వర్తిస్తుందని ఈసీ పేర్కొంది.

శభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదేశభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదే

ఇటీవలే సీఎం మమతా బెనర్జీ ప్రచారంపై నిషేధం విధించిన సందర్భంలో ఈసీపై టీఎంసీ సంచలన ఆరోపణలు చేసింది. ఈసీ ఏకపక్షంగా, బీజేపీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని, తామిచ్చిన ఫిర్యాదులపై స్పందించడం లేదంటూ టీఎంసీ లేఖలు కూడా రాసింది. ఈక్రమంలో ఇవాళ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిపైనా ఈసీ చర్యలకు దిగడం గమనార్హం.

EC bans Bengal BJP chief Dilip Ghosh from campaigning for 24 hours

దిలీప్ ఘోష్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 నిబంధనలను ఉల్లంఘించారని ఈసీ తన నోటీసులో పేర్కొంది. ప్రజలను రెచ్చగొట్టడం, వారి భావోద్వేగాలను తీవ్రంగా ప్రేరేపించే విధంగా దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని, తద్వారా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందని ఈసీ అభిప్రాయపడింది.

తిరుపతి: పవన్ కల్యాణ్ ఆఖరి అస్త్రం -లౌకిక సిద్ధాంతం -కరోనా వార్నింగ్ -బీజేపీ రత్నప్రభ ఎందుకంటేతిరుపతి: పవన్ కల్యాణ్ ఆఖరి అస్త్రం -లౌకిక సిద్ధాంతం -కరోనా వార్నింగ్ -బీజేపీ రత్నప్రభ ఎందుకంటే

బెంగాల్ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ లో కూచ్ బెహార్ ప్రాంతంలో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నాటి కాల్పుల ఘటనను సీఎం మమత ఖండించగా, అదే అంశాన్ని ప్రస్తావిస్తూ... ''''కేంద్ర బలగాలు కేవలం చూపుడు గుర్రాలే అని భావించే వారికి బుల్లెట్ల శక్తి బాగా అర్థమైందని అనుకుంటున్నా. ఇది ప్రారంభమే. కూచ్‌బెహార్ లాంటి ఘటనలు మరికొన్ని ప్రాంతాల్లోనూ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవాలని భావించే వారికి షీతల్‌కుచి (కూచ్‌బిహార్) ఘటన గట్టి జవాబు లాంటిది'' అని దిలీప్ ఘోష్ అన్నారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఈసీ చర్యలకు దిగింది.

English summary
The Election Commission of India on Thursday banned West Bengal BJP president Dilip Ghosh from campaigning in the state for 24 hours. In its order, the poll panel said after assessing Dilip Ghosh's reply to its notice, it is of the "considered view" that he violated the Model Code of Conduct by making "highly provocative and inciteful remarks" in his election speeches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X