వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీనియర్ నటి, వర్ధమాన నటుడి సినిమాలపై కన్నెర్ర..ప్రసారాలపై నిషేధం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సీనియర్ నటి, వర్ధమాన నటుడి సినిమాలపై వేటు పడింది. ఆ ఇద్దరు వేర్వేరుగా, కలిసి నటించిన సినిమాలను ప్రసారం చేయకూడదంటూ ఆదేశాలు వెలువడ్డాయి. ఎన్నికల డిప్యూటీ కమిషనర్, రిటర్నింగ్ అధికారి మంజుశ్రీ బుధవారం ఈ ఆదేశాలను జారీ చేశారు. వారే.. సుమలత, నిఖిల్ గౌడ. కర్ణాటకలోని మండ్య లోక్ సభ స్థానం నుంచి వారు పోటీ చేస్తున్నారు. సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిల్చోగా.. నిఖిల్ గౌడ జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో.. సుమలత, నిఖిల్ గౌడ నటించిన సినిమాలను దూరదర్శన్ లో ప్రసారం చేయకూడదని రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారు.

అనేక తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన సుమలత.. ప్రస్తుతం మండ్య లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కన్నడ రెబల్ స్టార్, కేంద్ర మాజీమంత్రి, దివంగత అంబరీష్ భార్యగా ఆమె రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ తరఫున ఆమె పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. పొత్తు వల్ల ఈ స్థానాన్ని జేడీఎస్ దక్కించుకుంది.

 EC Bans Movies Starring Sumalatha and Nikhil Gowda in DD

ఆటకట్టు : నీరవ్ మోదీ అరెస్ట్, కోర్టు వారెంట్ జారీ‌తో అదుపులోకి ఆర్థిక నేరస్థుడు ఆటకట్టు : నీరవ్ మోదీ అరెస్ట్, కోర్టు వారెంట్ జారీ‌తో అదుపులోకి ఆర్థిక నేరస్థుడు

జేడీఎస్ తరఫున వర్ధమాన నటుడు నిఖిల్ గౌడ బరిలో ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ.. తెలుగులో జాగ్వార్ అనే సినిమాలో హీరోగా నటించారు. కన్నడంలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నారు.

ఇద్దరు సినీ రంగానికి చెందిన వారే కావడంతో వారు నటించిన సినిమాలు దూరదర్శన్‌లో ప్రసారం చేయకూడదంటూ ఈసీ ఆదేశాలు జారీచేసింది. ప్రైవేటు టీవీ ఛానళ్లకు ఈ నిషేధం వర్తించదు. ప్రైవేటు ఛానళ్లలో వారిద్దరి సినిమానలు ప్రసారం చేసుకునే వీలుంది.

English summary
It’s a battle between movie stars in Mandya- Veteran actor and wife of rebel star Ambareesh – Sumalatha, is taking on young actor and Chief Minister HD Kumaraswamy’s son Nikhil Gowda at Mandya Lok Sabha constituency. The Election Commission on Wednesday banned screening of movies starring Sumalatha and Nikhil Gowda on Doordarshan till April 18, the day Mandya goes to polls. The order was issued by the Deputy Commissioner and Returning Officer of the Mandya Parliamentary segment N Manjushree. The ban, however, is not applicable to these films being screened in movie theatres and private TV channels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X