చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీతో పెట్టుకున్న టీటీవీ దినకరన్: మళ్లీ సినిమా కష్టాలు మొదలు, షార్జ్ షీట్ లో పేరు !

తమిళనాడు ప్రభుత్వంతో ఆడుకుంటున్న టీటీవీ దినకరన్ఢిల్లీతో పెట్టుకున్నాడు, మళ్లీ సినిమా కష్టాలు మొదలైనాయిచార్జ్ షీట్ లో పేరు చేర్చాలని నిర్ణయించిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాలని ప్రయత్నిస్తున్న టీటీవీ దినకరన్ కు మళ్లీ సినిమా కష్టాలు మొదలైనాయి. ఎన్నికల కమిషన్ అధికారుల దగ్గర అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో టీటీవీ దినకరన్ కు చుక్కెదురైయ్యింది.

అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి మధ్యవర్తి సుకేష్ సహాయంతో రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించడంతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్య వర్తి సుకేష్ ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు.

EC bribery case police file charge sheet against ttv dinakaran

ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని నమోదు అయిన కేసులో టీటీవీ దినకరన్, అతని ముఖ్య అనుచరుడు మల్లికార్జున్ తో పాటు మరి కొంత మందిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ తరువాత జామీను మీద బయటకు వచ్చాడు.

ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వాలని ప్రయత్నించిన కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక కోర్టులో కొన్ని నెలల క్రితం చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ చార్జ్ షీట్ లో టీటీవీ దినకరన్ పేరు తొలగించారు. ఇప్పుడు ఇదే కేసులో టీటీవీ దినకరన్ పేరు చేర్చడానికి చార్జ్ షీట్ కు అదనంగా మరో చార్జ్ షీట్ దాఖలు చెయ్యడానికి ఢిల్లీ పోలీసులు సిద్దం అయ్యారు. ఈ విషయం శనివారం వెలుగు చూడటంతో టీటీవీ దినకరన్, అతని అనుచరులు హడలిపోయారు.

English summary
Delhi Police will file additional charge sheet in a special court against AIADMK (Amma) faction leader TTV Dhinakaran in connection with the Election Commission bribery case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X