వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవిఎంల తారుమారు అసాధ్యం: ఈసి స్పష్టీకరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవిఎంలను) తారుమారు చేయడం సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ (ఈసి) స్పష్టం చేసింది. ఈవిఎంల్లో ఓటింగును తారుమారు చేసే అవకాశం ఉందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసి ఆ స్పష్టీకరణణ ఇచ్చింది.

పాటీదార్‌ ఉద్యమ నేత హర్దిక్ పటేల్ ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి అచల్ కుమార్ జోతి సోమవారం మీడియా ముందుకు వచ్చారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ గురి అయ్యే అవకాశమే లేదని ఆయన అంటున్నారు.

EC clarifies: EVM tampering is not possible

గతంలో ఎన్నికల సంఘం మీడియా సమక్షంలోనే వీటిపై ప్రయోగపూర్వకంగా వివరణ ఇచ్చింది. గుజరాత్‌ ఎన్నికల్లో వీవీపీఏటీ లను వినియోగించిన విషయం తెలిసిందే. అలాంటప్పుడు ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం సరికాదు అని ఆయన చెప్పారు.

ఏటీఎంలు హ్యాకింగ్‌కు గురైనప్పుడు.. ఈవీఎంలు కూడా హ్యాకింగ్‌కు గురి అయి తీరతాయని హర్దిక్‌ సోమవారం ఉదయం కూడా తాజాగా వ్యాఖ్యలు చేశాడు. అయితే గుజరాత్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి బీబీ స్వాయిన్‌ కూడా వాటిని తీవ్రంగా ఖండించారు.

English summary
Election Commission clarified that EVMs tampering is not possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X