వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వోద్యోగులపై ఈసీ డేగకన్ను .. ప్రచారం చేసినా, సోషల్ మీడియాలో షేర్ చేసినా ఉద్యోగం ఊస్టింగే

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. అటు పార్టీలు, ఇటు ప్రజలు రాజకీయాలపైన తమ అభిప్రాయాలను బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి నచ్చిన పార్టీకి వారు మద్దతు పలుకుతున్నారు. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ లతో చెలరేగిపోతున్నారు. అయితే ఎన్నికల విషయంలో ఎవరికి ఓటు వెయ్యాలి అని చెప్పే అవకాశం , ఏదో ఒక పార్టీ కి మద్దతు తెలిపే అవకాశం , సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసే అవకాశం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు లేదు . ఒకవేళ అలా ఎవరైనా చేస్తే అడ్డంగా బుక్కవుతారు.

<strong>మరోసారి నోరు జారిన బాలయ్య ... పీక కోస్తా నా కొడకా అంటూ ఫైర్ </strong>మరోసారి నోరు జారిన బాలయ్య ... పీక కోస్తా నా కొడకా అంటూ ఫైర్

ప్రభుత్వోద్యోగులు ఎలక్షన్ కోడ్ కిందకు వస్తారు ... నిబంధనలు వర్తిస్తాయి

ప్రభుత్వోద్యోగులు ఎలక్షన్ కోడ్ కిందకు వస్తారు ... నిబంధనలు వర్తిస్తాయి

ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు కోడ్‌‌‌‌‌‌ పరిధిలో ఉన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం వీరెవరు సభలు, సమావేశాల్లో పాల్గొనడం చెయ్యకూడదు . ఏదో ఒక పార్టీ కోసం పని చెయ్యటం , లేదా ప్రచారం చేయడం చెయ్యకూడదు. పార్టీలు, నేతలకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా చెయ్యకూడదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే ఉద్యోగానికి ఎసరొచ్చి పడుతుంది అని హెచ్చరిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు.

 ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండే ఈసీ నిఘా .. సోషల్ మీడియా లో సైతం ప్రచారం నేరమే

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండే ఈసీ నిఘా .. సోషల్ మీడియా లో సైతం ప్రచారం నేరమే

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచే ఉద్యోగులపై ఈసీ డేగకన్ను వేసింది. ఎవరైనా ఉద్యోగులు ఏదైనా పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారా అన్నది జాగ్రత్తగా గమనిస్తుంది. . ప్రత్యేకంగా సోషల్‌‌‌‌‌‌మీడియా అకౌంట్స్‌‌‌‌‌‌పైనిఘా పెట్టింది. తమకు నచ్చిన నాయకులకు మద్దతుగా తమ వాట్సాప్‌ , ఫేస్‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌, ట్విటర్‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌లో అప్ లోడ్ చేసినా ,షేర్ చేసినా కూడా అనవసరంగా బుక్ అవుతారు. ప్రచారంలో పాల్గొన్నట్టు ఎవరైనా ఫోటోలు, వీడియోలు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే పరేషాన్ కాక తప్పదు అని చెప్తుంది ఈసీ. కనుక రాజకీయాలను ప్రభావితం చేసేలా ప్రవర్తించినా, పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసినా ఆధారాలు దొరికితే అడ్డంగా బుక్ అవుతారు.

ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు ... ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్టింగ్

ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు ... ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్టింగ్

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం చేయ కూడదనే నిబంధనలు 1949 సెప్టెంబరు 17వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి . సెక్షన్‌‌‌‌‌‌ 23 (ఐ) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల కోడ్‌‌‌‌‌‌ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఈ సెక్షన్ వర్తిస్తుంది.ప్రభుత్వ ఉద్యోగికి అసెంబ్లీ, లోక్‌‌‌‌‌‌సభ,స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేయొచ్చు. కుటుంబ సభ్యుల పోటీకి అభ్యంతరం లేదు కానీ వారి కోసం ప్రచారం చేయకూడదు. ఇవి ఎన్నికల కమీషన్ నిబంధనలు. వీటిని ఉల్లంఘిస్తే , ఆధారాలతో దొరికితే కచ్చితంగా ఉద్యోగం ఊస్టింగ్ అవుతుంది. అందుకే ప్రభుత్వోద్యోగులు ... బహుపరాక్ .

English summary
The Election Commission has also imposed rules on government employees. The Election Code has come into force and EC has keep an eye on employees. It is important to note that somebody is working in favor of any party, Social media accounts specifically . the empolees will face problem if they used Watsap, Facebook and Twitter accounts uplinking and sharing in support of their favorite leaders. if government employees influence the politics, they will be booked .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X