వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల కోసం అభినందన్ ఫోటోలా .. ? బీజేపీ ఎమ్మెల్యేకు తలంటిన ఈసీ .

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగి .. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ పథకాలు, శంకుస్థాపనలే కాదు భారత సైన్యం గురించి నేతలు ఎక్కడ ప్రస్తావించొద్దు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. రాజకీయపార్టీలతోపాటు ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ యాజమాన్యాలు కోడ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని .. గీత దాటితే చర్యలు తప్పదని హెచ్చరించింది.

<strong>ఎలక్షన్ ఎఫెక్ట్ : ఏటీఎంలో రాని, చెలామణిలోలేని రూ.2 వేల నోటు</strong>ఎలక్షన్ ఎఫెక్ట్ : ఏటీఎంలో రాని, చెలామణిలోలేని రూ.2 వేల నోటు

శర్మకు చివాట్లు, ఫేస్ బుక్ కు ఆదేశాలు

శర్మకు చివాట్లు, ఫేస్ బుక్ కు ఆదేశాలు

అభినందన్ ఫోటో పోస్ట్ చేసిన ఎమ్మెల్యే
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ప్రదర్శించిన ధైర్య సాహసాలతో ఆయనకు ఎనలేని క్రేజీ తీసుకొచ్చింది. దీంతో ఆయనతో ఫొటోలు దిగేందుకు నేతలు కూడా పోటీపడ్డారు. అభినందన్ ఫోటోతో తమ ఫోటో చేర్చి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఢిల్లీలోని విశ్వాస్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మ ఈ నెల 1న అభినందన్ ఫొటోతోపాటు ప్రధాని మోదీ, బీజపీ చీఫ్ అమిత్ షా ఫోటోలతో రెండు పోస్టర్లను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. గత ఆదివారం (ఈ నెల 10న) ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినా ఆ పోస్టును తీసేయలేదు శర్మ.

శర్మకు చివాట్లు, ఫేస్ బుక్ కు ఆదేశాలు

శర్మకు చివాట్లు, ఫేస్ బుక్ కు ఆదేశాలు

ఫేస్ బుక్ లో పోస్టర్ల అంశాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. కోడ్ అమల్లోకి వచ్చినందున అభినందన్ ఫోటో తీసివేయాలని శర్మను ఆదేశించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సైన్యం గురించి ప్రస్తావించొద్దని ఈసీ స్పష్టంచేసింది. అలాగే ఫేస్ బుక్ యాజమాన్యానికి కూడా ఆదేశాలు జారీచేసింది. శర్మ పోస్ట్ చేసిన పోస్టర్ తొలగించాలని తేల్చిచెప్పంది. దీనిపై ఇదివరకే రాజకీయ పార్టీలు, నేతలు, సోషల్ మీడియా వెబ్ సైట్లకు ఆదేశాలు జారీచేసినట్టు పేర్కొన్నది.

పునరావృమైతే కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చర్యలు

పునరావృమైతే కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చర్యలు

ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించకుంటే చర్యలు తప్పవని సీఈసీ హెచ్చరించింది. ఈ అంశాన్ని ఇప్పటికే పలుమార్లు తెలియజేశామని, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ఎన్నికల సమయంలో సీఈసీ అన్ని నిశీతంగా గమనిస్తోందని .. ఎక్కడ, ఎవరూ, ఎలాంటి పోస్టు పెట్టినా ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది.

English summary
Wing Commander Abhinandan varthaman has brought crazy to him with the brave adventures performed. Leaders were competing to go with him. Posting with photos of Abhinandan, they posted on social media. On July 1, the BJP MLA Om Prakash Sharma posted two posters in the Facebook page with Prime Minister Narendra Modi and BJP Chief Amit Shah Photos. The CEC has seriously considered the posters has issued directions to Sharma and Face Book management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X