వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సైకిల్ ' పై సవారీ చేసేదేవరో, బలాన్ని నిరూపించుకోవాంటూ 'ఈసీ' నోటీసులు

సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కోసం తండ్రీ , తనయులకు ఎన్నికల కమీషన్ నోటీసును పంపింది. ఈ నోటీసుల ఆధారంగా ఈ నెల 9వ, తేదిలోపుగా తమ బలాన్ని నిరూపించే ఆధారాలను తమకు సమర్పించాలని ఎన్నికల కమీషన్ కోరింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :సైకిల్ గుర్తు కోసం సమాజ్ వాదీ పార్టీ లో రెండు గ్రూపులు పోటాపోటీగా ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించడంతో ములాయం సింగ్కు, అఖిలేష్ కు ఎన్నికల కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9వ, తేది లోపుగా తమ బలానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని కోరింది ఎన్నికల కమీషన్.

సమాజ్ వాదీ పార్టీలో రెండు గ్రూపుల మద్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకొంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఎన్నుకొన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ములాయం సింగ్ సవాల్ చేశాడు.

పార్టీ నియమనిబంధనావళికి విరుద్దంగా జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారని ఆయన మండిపడ్డారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే కారణంగా రామ్ గోపాల్ యాదవ్ పై వేటేశాడు ములాయం సింగ్ యాదవ్.

మెజారిటీ నాయకులు అఖిలేష్ యాదవ్ వైపు చేరారు.అయితే కేవలం ముప్పై మంది సిట్టింగ్ ఎంఏల్ఏలు మాత్రమే ములాయం శిభిరంలో ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ పార్టీ ఎన్నికల గుర్తును తనకే ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరాడు. అఖిలేష్ యాదవ్ కూడ ఈ విషయమై ఎన్నికల సంఘాన్ని కలిసి మెజార్టీ తన వైపే ఉందని తమకే సైకిల్ గుర్తును కేటాయించాలని కోరాడు.

సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కోసం తండ్రీ , తనయులకు ఎన్నికల కమీషన్ నోటీసును పంపింది. ఈ నోటీసుల ఆధారంగా ఈ నెల 9వ, తేదిలోపుగా తమ బలాన్ని నిరూపించే ఆధారాలను తమకు సమర్పించాలని ఎన్నికల కమీషన్ కోరింది.

సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కోసం తండ్రీ , తనయులకు ఎన్నికల కమీషన్ నోటీసును పంపింది. ఈ నోటీసుల ఆధారంగా ఈ నెల 9వ, తేదిలోపుగా తమ బలాన్ని నిరూపించే ఆధారాలను తమకు సమర్పించాలని ఎన్నికల కమీషన్ కోరింది.

ఎన్నికల గుర్తు కోసం ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లు ఎన్నికల సంఘం వద్ద పోటాపోటీడా పిటిషన్లు దాఖలు చేశారు.అయితే ఈ పిర్యాదులపై గతంలో చోటుచేసుకొన్న ఘటనలు, నిబంధనల ప్రకారంగా వ్యవహరిస్తామని ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఈమేరకు ఎన్నికల గుర్తు కోసం ఇద్దరు కూడ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దరిమిలా ఇద్దరూ నాయకులు కూడ 9వ, తేదిలోపుగా తమ వద్ద ఆధారాలతో కలిసి అఫిడవిట్లను సమర్పించాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 9వ, తేదిలోపుగా తమ అఫిడవిట్లను సమర్పించాల్సిందిగా కోరింది ఎన్నికల కమీషన్. ఈ మేరకు నోటీసులను జారీ చేసింది.

మెజారిటీ కమిటీలు ఎవరికి మద్దతిస్తే వారిదే గుర్తు

మెజారిటీ కమిటీలు ఎవరికి మద్దతిస్తే వారిదే గుర్తు

పార్టీల్లో నెలకొనే అంతర్గత గొడవల సందర్భంగా పార్టీలు చీలిపోయిన సందర్భాల్లో ఎన్నికల గుర్తు కోసం గతంలో కూడ గొడవలు జరిగిన సందర్భాలు కూడ లేకపోలేదు. అయితే ఈ గొడవలను దృష్టిలో ఉంచుకొని మెజారిటీ పార్టీ కమిటీలు, నాయకులు ఎవరివైపు ఉంటే వారికి ఎన్నికల గుర్తును కేటాయించిన సందర్భాలున్నాయి.గతంలో డిఎంకె నుండి వైగో బహిష్కరణకు గురయ్యాడు.

అయితే ఆయనతో పాటు 8 జిల్లాల కమిటీల కార్యదర్శులు కూడ పార్టీని వీడారు.అయితే ఎన్నికల గుర్తు కోసం ఆయన ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించాడు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలతో తనకు అనుకూలంగా చేసిన తీర్మాణాల కాపీలను డిఎంకె అధినేత కరుణానిధి ఎన్నికల కమీషన్ కు సమర్పించాడు. దీంతో ఉదయించే సూర్యుడు గుర్తును డిఎంకె వద్దే ఉంచారు.

మెజార్టీ నాయకులున్నా తీర్మాణాలను అఖిలేష్ పంపాలి

మెజార్టీ నాయకులున్నా తీర్మాణాలను అఖిలేష్ పంపాలి

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ పాదీ పార్టీలో మెజారిటీ నాయకులు అఖిలేష్ వైపే ఉన్నారు.అయితే ఈ మెజారిటీ నాయకులు అఖిలేష్ వైపున్నప్పటికీ తామంతా అఖిలేష్ ను సపోర్ట్ చేస్తున్నట్టు తీర్మాణాలను ఎన్నికల కమీషన్ కు పంపాల్సి ఉంటుంది. రాజకీయాల్లో సుదీర్ఘంగా అనుభవం ఉన్న ములాయం సింగ్ యాదవ్ కు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకొనే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నిపుణులు. మరో వైపు అఖిలేష్ కు మద్దతు పలికే వర్గమంతా ఈ మేరకు తీర్మాణాలు చేయకపోతే అకిలేష్ కు నష్టమే.

ఎన్నికల చిహ్నం వచ్చిన వారిదే పై చేయి

ఎన్నికల చిహ్నం వచ్చిన వారిదే పై చేయి

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.అయితే సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎన్నికల గుర్తు కోసం తండ్రీ కొడుకులు పోటాపోటీగా ప్రయత్నాలను ప్రారంభించారు .అయితే సమాజ్ వాదీ పార్టీకి ఎన్నికల గుర్తు సైకిల్ ఉంది.అయితే ఈ గుర్తు ఉత్తర్ ప్రదేశ్ ప్రజలకు చిరపరిచితం. అయితే ఈ గుర్తు వచ్చిన వారే రాజకీయంగా ఈ ఎన్నికల్లో ప్రయోజనం పొందుతారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఈ గుర్తు దక్కనివారు రాజకీయంగా ప్రయోజం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తండ్రీ తనయుల మద్య రాజీ కుదురుతోందా ?

తండ్రీ తనయుల మద్య రాజీ కుదురుతోందా ?

ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ల మద్య రాజీ కుదిరే అవకాశాలు కూడ లేకపోలేదనే చర్చ సాగుతోంది. ఎన్నికల కమీషన్ కు ములాయం సింగ్ యాదవ్ ఫిర్యాదుచేసిన తర్వాత పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి ఆజంఖాన్ ఇద్దరిమద్య రాజీ చేసేందుకు ప్రయత్నించారు. ఇద్దరితో ఫోన్ లో మంతనాలు జరిపారు. ఇదే దీంతో ఎన్నికల కమీషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ నేరుగా లక్నో కు తిరిగి వచ్చారు. తండ్రి లక్నో తిరిగిరాగానే అఖిలేష్ ములాయంతో చర్చించారు. ఈ చర్చలు జరిగి మూడురోజులదాటింది.అయితే ఆనాటి నుండి పార్టీ నాయకులు ఎవరూ కూడ బహిరంగంగా వ్యతిరేక ప్రకటనలు చేసుకోవడం లేదు. ఆజంఖాన్ మధ్యవర్తిత్వం పలిస్తోందా బెడిసి కొడుతోందా చూడాలి.

English summary
the election commisssion issued a notice to sp chief mulayam singh, and his son up cm akhilesh yadav, directing them to submitt affidavits with proofs of the numbers of members who support them by january 9
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X