వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు ప్రభుత్వం: శశికళ వర్గానికి భారీ ఎదురు దెబ్బ: టైం లేదని చెప్పిన ఎన్నికల కమిషన్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం ఎవ్వరికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకునే విషయంలో అఫిడవిట్లు సమర్పించడానికి తమకు ఇంకా సమయం కావాలని మనవి చేసిన వీకే. శశికళ నటరాజన్ వర్గంలోని టీటీవీ దినకరన్ కు చుక్కెదురైయ్యింది.

జయలలిత కోరడంతోనే వీడియో తీశాం, మమ్మల్ని రక్షించుకోవడానికి కాదు: టీటీవీ దినకరన్!జయలలిత కోరడంతోనే వీడియో తీశాం, మమ్మల్ని రక్షించుకోవడానికి కాదు: టీటీవీ దినకరన్!

తాము ఇంత వరకు ఇచ్చిన సమయం చాల ఎక్కువని, ఇంకా సమయం కావాలని మీరు కోరడం సరైన పద్దతి కాదని భారత ఎన్నికల కమిషన్ టీటీవీ దినకరన్ వర్గానికి సూచించింది. ఇప్పటి వరకు మీరు సమర్పించిన పత్రాలు, అఫిడవిట్లు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ చెప్పింది.

EC rejects TTV Dinakaran’s plea for time extension

అక్టోబర్ 5వ తేది 3 గంటలకు అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం ఏ వర్గానికి ఇవ్వాలో నిర్ణయిస్తామని, అంతకు ముందు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అఫిడవిట్లు సమర్పించాలని రెండు వర్గాలకు భారత ఎన్నికల కమిషన్ ఈ నెల 28వ తేదీ వరకు సమయం ఇచ్చింది.

జయలలిత స్పృహలోని స్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్లారు: షుగర్ లెవెల్స్ 508, కుట్ర జరిగిందా!జయలలిత స్పృహలోని స్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్లారు: షుగర్ లెవెల్స్ 508, కుట్ర జరిగిందా!

అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం ఎవ్వరికి కేటాయించాలి అనే విషయంలో వివరణ ఇవ్వడానికి మాకు ఇంకా 15 రోజులు సమయం కావాలని టీటీవీ దినకరన్ వర్గం భారత ఎన్నికల కమిషన్ కు టీటీవీ దినకరన్ వర్గం మనవి చేసింది. టీటీవీ దినకరన్ వర్గం చేసిన మనవిని భారత ఎన్నికల కమిషన్ తిరస్కరించడంతో శశికళ వర్గానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది.

English summary
The Election Commission, on Thursday, rejected the plea of T.T.V. Dinakaran, leader of a faction of AIADMK, for 15 days' time to file documents in the "Two Leaves" symbol case and made it clear that hearing would take place on October 6 as scheduled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X