వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే ఉద్యోగుల జాబితా ఇదే: జర్నలిస్టులకూ: ఎన్నికల కమిషన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌‌‌లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడానికి ఈసీ సమాయాత్తమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇదివరకే విడుదల చేసింది. తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించింది కేంద్ర ఎన్నికల కమిషన్.

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న ఆంక్షలు కొంత అడ్డంకిగా మారినప్పటికీ- నియోజకవర్గ స్థాయిలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలకు లోబడి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహిస్తోన్నాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్.. తమ పట్టును నిలబెట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోన్నాయి.

ఈ పరిణామాల మధ్య తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునే శాఖలు, విభాగాల పేర్లను వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని మరింత విస్తరింపజేశారు. అన్ని రాష్ట్రాలకూ ఈ తాజా నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు.

EC Releases List Of Essential Service Workers Including media Allowed To Use Postal Ballot facility

పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులందరికీ వర్తింపజేయలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించిన వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. సమాచార, పౌర సంబంధాల శాఖ, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం (అత్యవసర సర్వీసులు/అంబులెన్స్ సిబ్బంది), పోస్టల్, ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, రైల్వే, విద్యుత్, పౌర విమానాయాన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే వెసలుబాటును కల్పించారు.

ఉత్తర ప్రదేశ్‌లో మెట్రో రైలు కార్పొరేషన్ ఉద్యోగులకు కూడా ఈ వసతిని వర్తింపజేశారు. ఆల్ ఇండియా రేడియో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ఆహారం-పౌర సరఫరాలు, దూరదర్శన్, అగ్నిమాపక శాఖకు పోస్టల్ బ్యాలెట్ వసతిని కల్పించారు. అటవీ, వాటర్ అథారిటీ, షిప్పింగ్ కార్పొరేషన్, రివర్ నేవిగేటర్/రివర్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగులకూ ఈ వీలును కల్పించారు.

English summary
Election Commission releases list of essential workers allowed to use postal ballot facility for the upcoming assembly polls in 5 states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X