వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ చాపర్‌ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారిపై వేటు వేసిన ఈసీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019: మోడీ చాపర్‌ను... తనిఖీ చేసిన IAS అధికారిపై వేటు!!

ఎన్నికల నిబంధనలకు లోబడి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎంతటి వారినైనా సరే వదలడం లేదు. ఇలా తనిఖీలు చేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం, బంగారం వంటవి పట్టుకుంది. ఫ్లయింగ్ స్క్వాడ్‌లో భాగంగా ఉన్న మరికొందరు అధికారులు నిబంధనలను మరిచి తనిఖీలు చేసి కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే బుధవారం ఒడిషాలో చోటుచేసుకుంది.

 తనిఖీలు చేశారు...వేటు వేశారు

తనిఖీలు చేశారు...వేటు వేశారు

ఒడిషాలో ఎన్నికల పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి మొహ్మద్ మోహిసిన్‌ను నియమించారు. 1996 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మోహిసిన్.... తన విధుల్లో భాగంగా ఏకంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను సంబల్‌పూర్‌లో తనిఖీ చేశాడు. దీంతో లేనిపోని కష్టాలు తెచ్చుకున్నాడు. ప్రధాని హెలికాఫ్టర్ చెక్‌చేయడంతో మోహిసిన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

తనిఖీల నుంచి ఎస్పీజీ రక్షణ ఉన్నవారికి మినహాయింపు

తనిఖీల నుంచి ఎస్పీజీ రక్షణ ఉన్నవారికి మినహాయింపు

ప్రధాని నరేంద్ర మోడీ వీవీఐపీ కేటగిరీలోకి వస్తారు. ఆయనకు ఎస్పీజీ రక్షణ ఉంటుంది. ఎస్పీజీ రక్షణ కలిగి ఉన్నవారు తనిఖీలనుంచి మినహాయింపు ఇస్తోంది ఎన్నికల సంఘం. మరి ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి మొహ్మద్ మోహిసిన్ తెలిసి తనిఖీలు చేశాడో లేదా ప్రధాని ఎస్పీజీ రక్షణ కలిగి ఉన్న వ్యక్తి అని మరిచి చేశాడో తెలియదు కానీ మొత్తానికీ ఆయన హెలికాఫ్టర్ తనిఖీ చేసి సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఓ ట్రంకు పెట్టెను మరో వాహనంలో పెడుతున్న వీడియో

ఓ ట్రంకు పెట్టెను మరో వాహనంలో పెడుతున్న వీడియో

ఇక ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను తనిఖీలు చేయడంతో ఆయన 15 నిమిషాలు పాటు వేచిచూడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను కూడా రౌర్ కేలాలో చెక్ చేశారు. ఎన్నికల సిబ్బంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చాపర్‌ను కూడా సంబల్ పూర్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. కొద్ది రోజుల ముందు ప్రధాని చాపర్‌లో ఏదో నల్ల ట్రంకు పెట్టెను దించి మరో వాహనంలోకి ఎక్కిస్తున్న వీడియో బయటపడింది. దీంతో ప్రతిపక్షాలు ప్రధాని తన చాపర్‌లో డబ్బులు తరలిస్తున్నారని తీవ్రఆరోపణలు చేశాయి. ఆ తర్వాత కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హెలికాఫ్టర్‌ను కూడా తనిఖీలు చేసిన దృశ్యాలు బయటపడ్డాయి.

English summary
An officer posted as General Observer in Odisha has been suspended by the Election Commission for allegedly checking Prime Minister Narendra Modi's helicopter in Sambalpur on Tuesday, in violation of norms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X