వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిషన్ శక్తి ప్రకటనపై ఈసీ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

రెండు రోజల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రకటించిన మిషన్ శక్తి ప్రకటన దుమారం రేపుతోంది.మోది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘీంచారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ,సిపిఎమ్పార్టీలు ఈసి కి ఫిర్యాదు చేశాయి.దీంతో ఆ మోది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘీంచారా లేదా అనే అంశాన్ని నేడు ఈసి తేల్చనుంది.

మిషన్ శక్తి ప్రకటన

మిషన్ శక్తి ప్రకటన

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలోనే ప్రధాన మంత్రి మోడి బుధవారం స్పెస్ శక్తిలో భారత్ స్థానం సంపాందించంటూ మిషన్ శక్తి ప్రయోగాన్ని ప్రజలకు వెల్లడించారు.అయితే ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎన్నికల కోడ్ ఉన్న నేఫథ్యంలో ప్రధాని మోడి నేరుగా ఆ విషయాన్ని ప్రకటించడం కోడ్ ఉల్లంఘనల క్రిందకు వస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కమ్యూనిస్టు నేతలు ఈసికి ఫిర్యాదు చేశారు.ప్రకటనుకు ముందు ఈసిని సంప్రదించారా లేదా అనే అంశాన్ని ప్రశ్నించారు.

అధికార ప్రతిపక్షల మధ్య మాటల యుద్దం

అధికార ప్రతిపక్షల మధ్య మాటల యుద్దం

దీంతో అటు అధికార పార్టీ మధ్య , ఇటు ప్రతి పక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.ఈనేపథ్యంలో రాహుల్ గాంధి, ప్రధానిని ఉద్దేశించి వ్యంగంగా ప్రధానమంత్రి ప్రపంచ నాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపాలనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.మరో వైపు మోది ఏమైన అంతరిక్షంలోకి వెళతాడా మమతా బెనర్జీ సైతం వ్యాఖ్యానించారు.అయితే బిజేపి కూడ రాహుల్ గాంధి అటు సైంటీస్టులను అవమానిస్తున్నారని ,బాలాకోట్ దాడి జరిగిన నేపథ్యంలో సైనికులను అవమానించినట్టుగానే ఇప్పుడు సైంటిస్టులను అవమానిస్తున్నారని మండిపడ్డారు.

 జాతియ భద్రతా అంశాలు కోడ్ కిందకు రావు

జాతియ భద్రతా అంశాలు కోడ్ కిందకు రావు

జాతియ భద్రత అంశాలకు సంబంధించిన అంశాలు ఎన్నికల కోడ్ క్రిందకు రావని కాంగ్రెస్ చెప్పుకోస్తుంది.దీంతో దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని చెబుతోంది.ఈనేపథ్యంలోనే కాంగ్రస్ పార్టీ ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతోంది. దీంతో ఎన్నికల కమీషన్ దీనికి ఫుల్ పెట్టేందుకు సిద్దమైంది.

ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై తేల్చనున్న ఈసి

ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై తేల్చనున్న ఈసి

ఇక ఈ పరిణామాల నేపధ్యంలో ఈసి రంగంలోకి దిగింది. మోడి ప్రకటనపై ఇప్పటికే రెండు సార్లు సమావేశమైంది. కాగా మోడి ప్రకటనను ప్రసారం చేసిన దూరదర్శన్ తోపాటు ఆల్ ఇండియా రేడియోలు తమ సమాధానాన్ని ఈసికి పంపాయి. మోడి మాట్లాడిని విషయాన్ని పరీశీంచేందుకు అటు ఆల్ ఇండియా రేడియోతో పాటు దూరదర్శన్ లో వచ్చిన వీడీయోను పరీశిలిస్తున్నామని ఎన్నికల కమీషన్ డిప్యూటి కమిషనర్ ,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంచార్జ్ అయినా సందీప్ సక్సేనా వెల్లడించారు.కాగా దానిపై ఈరోజు పూర్తి నిర్ణయం వెలువడనుందని తెలిపారు.కాగా ప్రకటపై ఈసిని అనుమతి కోరలేదని స్పష్టం చేసింది.

అయితే ఈ అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఎలాంటీ స్పందన కన్పించడం లేదు.మరి ఈసి వీటిని పరీశీలించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

English summary
PM Modi’s Mission Shakti speech violated poll code or not, EC to decide today, on this issue The committee has held two meetings and also sought responses from Doordarshan and the All India Radio over the source of the feed .The poll body said a committee was examining the speech of the prime minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X