gujarat assembly election results 2017 gujarat election results 2017 gujarat assembly elections 2017 rahul gandhi ec గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్ ఎన్నికలు రాహుల్ గాంధీ ఈసీ
గుజరాత్ ఎన్నికలు: రాహుల్ గాంధీకి ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకున్న ఈసీ
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి ఇచ్చిన నోటీసులను ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం రాత్రి ఉపసంహరించుకుంది. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఆయన టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
దీంతో ఈసీ ఆయనకు నోటీసులు పంపించింది. డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా విస్తరించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 126 పైన సమీక్షించాల్సి ఉన్నందున నోటీసును వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది.
నాన్‌సెన్స్: గుజరాత్‌లో బీజేపీ గెలుపుపై జిగ్నేష్, అందుకే బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం మీడియా వివిధ రూపాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు ప్రచారాన్ని నిలిపివేయాలన్న నిబంధనపై సమీక్షించేందుకు, సవరణలు సూచించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఈసీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీలో ఎన్నికల సంఘం, సమాచార, ప్రసార, న్యాయ, ఐటీ శాఖలు, నేషనల్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్, ప్రెస్ కౌన్సిల్ ప్రతినిధులు ఉంటారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటం, వివిధ దశలలో పోలింగ్ నిర్వహిస్తున్న దృష్ట్యా దీనిని సమీక్షించాల్సి ఉందని ఈసీ పేర్కొంది.