వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోతుందా ?

|
Google Oneindia TeluguNews

ఎన్నికలను సమర్థంతవంతంగా ,నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ తన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతుందని దేశంలోని 66 మంది పదవి విరమణ పోందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు ఐదు పేజీల లేఖను రాసింది. ఎలాంటీ పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రపతిని కోరారు.

ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా ?

ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా ?

ఎన్నికల కమిషన్ రాజ్యంగాబద్దంగా ఎర్పడిన కమిషన్ , ఎన్నికల సమయంలో అధికారులు , రాజకీయానాయకుల ఒత్తిడిలకు తలోగ్గి తమ విధులను నిర్వర్తించాల్సిన అవసరం ఉండదు,అందుకే దాన్ని రాజ్యంగం లోని ప్రత్యేక హక్కుల ద్వార , స్వతంత్ర్య ప్రతిపత్తిగత సంస్థగా ఏర్పడింది. కాని గత స్వాతంత్ర్యకాలం నుండి కమిషన్ తాను నిర్వహించే విధులపై ప్రజల నుండి విమర్శలను ఎదుర్కోంటుంది. ఈనేపథ్యంలోనే అసలు ఎన్నికల కమిషన్ ఏమిటి,దాని బాద్యత ఎలా ఉంటుందని అనేది మొదటిసారిగా ప్రజలకు రుచి చూపించిన, 1990 లో ఈసీ చీఫ్ కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన టీఎన్ శేషన్ వచ్చేవరకు ఎవ్వరికి తెలియదు. ఈనేపథ్యంలో ఆయన అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు సంచనాలను రేపాయి.కాని అనంతరం జరిగిన పరిణామాల్లో ఎన్నికల కమిషన్ కోరలు కూడ పీకివేశారు మన పాలకులు ,ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకుంటుందనే అరోపణలు వెల్లువెత్తున్నాయి.ఈేనేపథ్యంలోనే దేశంలో 66మంది మాజీ ఉన్నతాధికారులు ఈసీ తీరుపై రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు 5 పేజీలతో కూడిన లేఖను వ్రాశారు.

ఉన్నతాధికారుల లేఖలోని అంశాలు

ఉన్నతాధికారుల లేఖలోని అంశాలు

ప్రధానంగా మాజీ అధికారులు ఈసి యొక్క నిబద్దత ,పక్షపాతంతోపాటు సమర్థతను ప్రశ్నించారు. దేశంలో పాలకపార్టీకి ఈసి కొమ్ము కాస్తుండడంతోపాటు, దాని పై విశ్వాసం సన్నగిల్లేవిధంగా ప్రవర్తిస్తోందంటూ పేర్కోన్నారు.కాగా ఎన్నికల నియామావలని తమకు అనుకూలంగా మార్చుకోవడం చాల భాదకరమని పేర్కోన్నారు. ఈ సంధర్భంలోనే ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయతను సంక్షోభంలో పడేయడంతోపాటు దాని సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలోనే ఈసీఐ యొక్క బలహీనమైన ప్రవర్తన, రాజ్యంగం యొక్క విశ్వసనీయతను దెబ్బతీస్తుందని తమ లేఖలో పేర్కోన్నారు.కాగా భారత ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడవేస్తున్నారని తెలిపారు. కేంద్రంలో ఉన్న పాలక పార్టీల చేత ఎన్నికల ప్రవర్తానా నియామావళి ఉల్లంఘించడంపై తామంతా భాధపడుతున్నామని తెలిపారు.ఈ నేపథ్యంలోనే ఇటివల ఈసీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకున్న పలు నిర్ణయాలను వివరించారు.

ఈసీ నిర్ణయాలు, మోడీ ఏ శాట్ పబ్లిసిటి

ఈసీ నిర్ణయాలు, మోడీ ఏ శాట్ పబ్లిసిటి

ఇటివల ఏశాట్ విజయంతమైన సంధర్భంగా ప్రధాని మోడి ఆ ప్రయోగం గూర్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడరని ,ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఈ పద్దతిలో విజయాలు సాధించిన అంశాలను ప్రకటించడం ప్రజలను ప్రభావితం చేస్తాయని తెలిపారు.మరోవైపు ప్రధాని నరేంద్రమోడి బయోపిక్ ఈనేపధ్యంలో ఈసీలో బిన్నాభిప్రాయాలు ఉండడం పై కూడ లేఖలో పేర్కోన్నారు..ఇక ''మోడీ జీకి సేన'' అంటూ యూపి సీఎం యోగి అదిత్యానాధ్ వ్యాఖ్యలు కూడ బాద్యతరహిత్యామని అన్నారు. కాగా ఇలాంటీ వాటిపై కఠినపరమైన చర్యలు తీసుకోవడం చాల అవకసరమని తెలిపారు.

English summary
The 66 former bureaucrats have expressed concern over the working of the Election Commission, which they said is suffering from a crisis of credibility. The bureaucrats have appealed to the President to ensure fair Lok Sabha elections.former bureaucrats have written to President Ram Nath Kovind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X