రాజకీయపార్టీల ఖర్చుల వివరాలపై సంస్కరణలు తెచ్చే యోచనలో ఎన్నికలసంఘం
ఎన్నికల ఖర్చులపై సంస్కరణలు తీసుకురావాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఆయా రాజకీయపార్టీలు చేసే ఖర్చలపై పరిమితి విధించాలని భావిస్తోంది. ఎన్నికల ఖర్చుపై పరిమితి విధించాలంటూ అత్యధిక రాజకీయపార్టీలనుంచి వచ్చిన పిటిషన్లను పరిశీలిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. సంస్కరణల ముసాయిదా సిద్ధం చేసి న్యాయమంత్రిత్వ శాఖకు పంపుతామని వెల్లడించింది.
ఆగష్టులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఎన్నికల ఖర్చుపై పరిమితి విధించాలని ఈసీని కోరాయి. అయితే బీజేపీ మాత్రం ఈ విషయంపై ఏమి మాట్లాడలేదు. ఎన్నికల సమయంలో బీజేపీ విపరీతంగా డబ్బులు పంచుతోందని పరిమితికి మించి ఖర్చు చేస్తోందని ఎన్నికల సంఘం దృష్టికి పార్టీలు తీసుకొచ్చాయి. అయితే ఖర్చులపై పరిమితి విధిస్తూ సంస్కరణలు తీసుకొస్తామని ఈసీ చెప్పడం శుభపరిణామం అని రాజకీయపార్టీలు తెలిపాయి.

ఈ క్రమంలోనే ఒక సీలింగ్ పద్ధతిని అవలంబిస్తే రాజకీయపార్టీలు డబ్బున విచ్చలవిడిగా ఖర్చుచేయకుండా కొంత నియంత్రించొచ్చని ఆయా రాజకీయపార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.












Click it and Unblock the Notifications