వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీసేన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. కేంద్రమంత్రి నఖ్వీకి వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ క్రమంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ లీడర్ అజం ఖాన్ తదితర నేతలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝలిపించింది. ఆ జాబితాలో తాజాగా కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేరారు.

<strong>దొంగల లిస్టులో మోడీ..! రాహుల్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా</strong>దొంగల లిస్టులో మోడీ..! రాహుల్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ నెల 3వ తేదీన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న నఖ్వీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉగ్రవాదుల శిబిరాలపై వాయుసేన దాడిచేయగా.. మోడీసేన అంటూ ఆయన వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
మోడీ సేన దాడులపై ఆధారాలు కావాలని విపక్షాలు కోరడం సరికాదంటూ నఖ్వీ ఆ ర్యాలీలో ప్రసంగించారు. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ECI warns Mukhtar Abbas Naqvi over Modi ki Sena comment

అదలావుంటే.. నఖ్వీ వ్యాఖ్యలపై అటు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అల్టిమేటం ఇచ్చింది. ఎన్నికల ప్రచార వేళ భద్రతా బలగాల ఊసెత్తొద్దని హెచ్చరించింది.

English summary
The Election Commission of India warned Union Minister Mukhtar Abbas Naqvi over his 'Modi ki Sena' comment, asking him to desist from using references to security forces for political propaganda and to be careful in future. "Whereas, the District Election Officer, Rampur had issued a show cause notice to Mukhtar Abbas Naqvi, for violation of Code of Conduct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X