ECILలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 5 జనవరి 2019.
సంస్థ పేరు : ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 2100
పోస్టు పేరు : జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 5 జనవరి 2019

విద్యార్హతలు:
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 60శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ
జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్: 60శాతం మార్కులతో ఇంజనీరింగ్లో డిప్లొమా
వయస్సు :
జూనియర్ టెక్నకల్ ఆఫీసర్: 31 డిసెంబర్ 1988 తర్వాత జన్మించి ఉండాలి
జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్: 31 డిసెంబరు 1993 తర్వాత జన్మించి ఉండాలి
వేతనం:
జూనియర్ టెక్నకల్ ఆఫీసర్: నెలకు రూ. 19188/-
జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్:నెలకు రూ. 17654/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.200/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 26 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ : 5 జనవరి 2019
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!