వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి క్షిపణి: భారత సైన్యంలోకి అధికారికంగా 'ఆకాశ్'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో అత్యంత అధునాతన క్షిపణి చేరబోతోంది. 'ఆకాశ్‌' పేరుతో హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆధ్వర్యంలో రూపొందించిన ఈ క్షిపణిని భారత సైన్యంలోకి మంగళవారం అధికారికంగా చేరుతోంది. పూర్తిగా స్వదేశీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన తొలి ఉపరితల క్షిపణి ఇదే కావడం విశేషం.

శత్రుదేశాల లక్ష్యాలను అంతమొందించేందుకు గాను హెలికాప్టర్లు, ద్రోణులను వినియోగించాల్సిన అవసరం లేకుండా 'ఆకాశ్‌' క్షిపణిని రూపొందించారు. ఈరోజు ఉదయం ఢిల్లీలోని మానిక్ షా సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ దీనిని భారత సైన్యానికి అంకితం చేస్తారు.

ECIL systems play vital role in Akash missile programme

'ఆకాశ్‌' క్షిపణి ప్రత్యేకతలు:

* ఆకాశంలోని శత్రుదేశాలకు చెందిన విమానాల లక్ష్యాలను ఛేదిస్తుంది.

* 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని 35 సెకనల్లో నేల మట్టం చేస్తుంది.

* ఒకేసారి నాలుగు లక్ష్యాలపై ఎనిమిది క్షిపణలును ప్రయోగించొచ్చు.

* లాంచింగ్‌ ప్యాడ్‌ ద్వారా ప్రయోగించేందుకు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించొచ్చు.

* రాడార్ అనుసంధానంతో పనిచేస్తుంది.

ఆకాశ్‌ క్షిపణి తయారీలో హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) రెండు అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన వాహనాలను రూపొందించిందని ఆకాస్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ జి. చంద్రమౌళి సోమవారం ప్రకటించారు.

కంబాట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ), మొబైల్‌ సిస్టమ్‌ ఫర్‌ మిసైల్స్‌ చెక్‌అవుట్‌ పేరుతో తయారుచేసిన వాహనాల పరిజ్ఞానంతో భూమి పైనుంచి క్షిపణి పనితీరు, కంట్రోల్‌ అంశాలను పరిశీలించొచ్చని పేర్కొంది. బీడీఎల్‌ సంస్థ ఇచ్చిన ఆర్డర్‌పై, డీఆర్‌డీఎల్‌ సహకారంతో ఈ వాహనాలను తయారు చేసినట్లు తెలిపారు.

English summary
Electronics Corporation of India Limited (ECIL), in partnership with Bharat Dynamics Limited (BDL), is supplying critical electronic systems for Akash Weapon System (AWS) to be inducted into the Indian Army at a function in Delhi tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X