వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్‌డౌన్‌తో కరోనా కేసులు పెరిగే ఛాన్స్: రాహుల్ గాంధీ ఆందోళన, మోడీకి లేఖ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు తాము అండగా అంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా దినసరి, వలస కూలీల బతుకులు దుర్భరంగా మారిపోయాయని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం మంచి పరిణామమని అన్నారు. అయితే, లాక్ డౌన్ ప్రభావం రోజువారీ కూలీలపై పడుతోందని అన్నారు. లాక్ డౌన్ తో పట్టణాల్లో ఉన్న యువకులు గ్రామాల బాటపట్టారని, దీని వల్ల గ్రామాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులను కాపాడుకుంటూనే యువకులను హెచ్చరించాలన్నారు.

Economic consequences of total shutdown will increase Covid-19 death toll: Rahul Gandhi to PM Modi

జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఆస్పత్రులు, వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. కార్మికులు ఇబ్బంది పడకుండా తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాలని కోరిన విషయం తెలిసిందే. దీంతో దేశమంతా జనతా కర్ఫ్యూను పాటించి విజయవంతం చేశారు. అయితే, సమస్య తీవ్రతను గమనించిన రాష్ట్రాలే లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక దేశంలో మార్చి 25 అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ అమలు చేశారు. మూడు వారాలపాటు లాక్ డౌన్ పాటించాలని దేశ ప్రజలను ప్రధాని కోరిన విషయం తెలిసిందే. కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Recommended Video

Ravi Shastri Says 'Forced break a 'welcome rest' for India players'

అయితే, ఈ లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినే అవకాశం ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సరైన ఏర్పాట్లు చేయకుండా ఇలా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలు, కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Economic consequences of total shutdown will increase Covid-19 death toll: Rahul Gandhi to PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X