వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Economic Survey: ఎవరుపడితే వాళ్లు మార్చేసే వికీపిడియా డేటాతో ఆర్టికసర్వే? రిపోర్టుపై రచ్చ

|
Google Oneindia TeluguNews

ఆర్థిక వ్యవస్థలో గతేడాది చోటుచేసుకున్న పరిణామాలతోపాటు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఒక దిశ, దశ, లక్ష్యాన్ని సూచించే ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ముఖ్య ఆర్థిక సలహాదారు ముఖ్య ఆర్థిక స‌ల‌హాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ రూపొందించిన ఈ సర్వేకు.. వికీపిడియాలోని డేటాను కూడా సోర్స్ గా వాడుకున్నట్లు వెల్లడికావడం చర్చనీయాంశమైంది.

దాన్నెలా నమ్ముతారు?
వికీపిడియాలో డేటాను ఎవరైనా, ఎప్పుడైనా, ఎలాగైనా మార్చేసే వీలుంటుంది. కాబట్టే దాన్ని అథెంటిక్ సమాచారంగా విశ్వసించరు. అలాంటి డేటాను కీలకమైన ఆర్థిక సర్వేకోసం వాడటమేంటని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాయి. అయితే భారీ ఎత్తున చేసే ఆర్థిక సర్వేలో.. అతికొద్ది శాతంగా మాత్రమే వికీపిడియా డేటాను వాడుకున్నట్లు రూపకర్తలు వివరణ ఇచ్చారు.

Economic Survey sources data from Wikipedia: opposition slams center

వికీపీడియాతోపాటు బ్లూమ్స్ బర్గ్, ఐసీఆర్ఐ, సీఎంఐఈ, ఐఐఎం బెంగళూరు, ఫోర్బ్స్, బీఎస్ఈ, హెరిటేజ్ డాట్ ఆర్గ్, ఫ్రాసెర్ ఇనిస్టిట్యూట్ డాట్ ఆర్గ్, అంబిత్ క్యాపిటల్ లాంటి ప్రైవేటు సంస్థల డేటాను కూడా ఆర్థిక సర్వేకు సోర్స్ గా వాడుకున్నట్లు వెల్లడైంది. వీటితోపాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ, సిబిల్, జాతీయ శాంపిల్ సర్వే, వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఐక్యరాజ్యసమితి, సిబడ్జిల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు.

English summary
The Economic Survey 2019-20 has sourced certain data from Wikipedia, which is not considered as reliable source of information. opposition parties slams center
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X