వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రో, డీజిల్ ధర పెంపు దేశ వ్యతిరేక చర్య, ఆపత్కాలంలో ప్రజలపై భారం భావ్యం కాదు: రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారిని దేశం ఎదుర్కొంటోన్న సమయంలో పెట్రో ఉత్పత్తులపై ధరల పెంపును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇది ఆర్థికంగా దేశ వ్యతిరేక చర్య అని మండిపడింది. పెంచిన ధరలతో రూ1.4 లక్షల కోట్ల భారం వినియోగదారులపై పడబోతుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు.

పెట్రో భారం..

పెట్రో భారం..

వైరస్ వల్ల పేదలు, వలసకూలీలు, దుకాణాదారులు, చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని సుర్జేవాలా పేర్కొన్నారు. ఈ క్రమంలో 130 కోట్ల మంది ప్రజలపై పెట్రో భారం వేయడం మంచిది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తెలిపారు. ఆర్థిక నష్టాలను రికవరీ చేసేందుకు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడం సరికాదని సూచించారు. ఇది అక్రమం, బలవంతంగా చేస్తోన్న అమానవీయ చర్య అని మండిపడ్డారు. ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

సీఎంలతో చర్చ..

సీఎంలతో చర్చ..


పెట్రో ఉత్పత్తుల ధరపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అధినేత సోనియాగాంధీ చర్చించారని సుర్జేవాలా తెలిపారు. దీనిపై వారితోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ధర తగ్గించాల్సిన కేంద్రం.. పెంచిందని రాహుల్ గాంధీ విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 డీజిల్‌పై రూ.7.10..

డీజిల్‌పై రూ.7.10..

రూ.10 నుంచి రూ.13 వరకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఎక్సైజ్ సుంకం పెంచడం వల్ల.. వినియోగదారులపై ప్రభావం చూపలేదు. అంతర్జాతీయ ముడిచమురు ధరలు ఇటీవల తగ్గించకుండా వాటిని కంపెనీలు సర్దుబాటు చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై రూ.1.67 ధర పెంచగా, డీజిల్‌పై రూ.7.10 పెంచారు. డీజిల్‌పై వ్యాట్ సహా ఇతర పన్నులను ఆప్ సర్కార్ వేసింది. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.69.59 నుంచి రూ.71.26 కాగా, డీజిల్ ధర రూ..62.29 నుంచి 69.39కి చేరింది.

English summary
Congress leader Rahul Gandhi said when the fight against COVID-19 is causing economic hardship to all, the government instead of reducing prices has raised them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X