వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో ఆర్థిక మాంద్యం -కప్పిపుచ్చే యత్నంలో ప్రభుత్వం -నిర్మల ‘ఆత్మనిర్భర్-3’ వట్టి డొల్ల: చిదంబరం

|
Google Oneindia TeluguNews

కొవిడ్‌ సంక్షోభంతో కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకుగానూ 'ఆత్మనిర్భర్ భారత్ 3' పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన వట్టి డొల్ల అని, అది కేవలం పత్రికల హెడ్ లైన్లను మేనేజ్ చేసే ప్రయత్నమని కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం విమర్శించారు. దేశంలో ఇప్పటికే ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నదని, దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలీక, మోదీ సర్కార్ కప్పిపుచ్చే చర్యలకు దిగుతున్నది ఆయన చెప్పారు.

 బీహార్: భారీ షాకిచ్చిన నితీశ్ కుమార్ - సీఎం పదవి కోరలేదు -అది బీజేపీ ఇష్టం -ప్రమాణం తేదీ తెలీదు బీహార్: భారీ షాకిచ్చిన నితీశ్ కుమార్ - సీఎం పదవి కోరలేదు -అది బీజేపీ ఇష్టం -ప్రమాణం తేదీ తెలీదు

కరోనా అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేసేందుకు ఇప్పటికే మూడు ఉద్దీపన పథకాలను వెలువరించిన కేంద్రం.. గురువారం 'ఆత్మనిర్భర్ భారత్ 3' పేరుతో మరో ప్యాకేజీని నాలుగో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. 12 అంశాలతో కూడిన నిర్మలా సీతారామన్ ప్రకటన అనంతరం.. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిదంబరం, తన సహచరుడు జైరాం రమేశ్ తో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశ ఆర్థిక స్థితిపై ఆయన కీలక విషయాలు చెప్పుకొచ్చారు..

economy was in recession, Atmanirbhar Bharat 3 is just for headlines:P Chidambaram

స్వాతంత్ర్యం తరువాత భారతదేశం మొట్టమొదటిసారి ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన సందర్భం ఇదేనని చిదంబరం చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆర్థిక ప్రగతి రేటు మైనస్ -23 గా ఉందని, ఇదే ఏడాది రెండో త్రైమాసికంలో ఆ సంఖ్య మైనస్ -8.6గా నమోదైందని, వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధిరేటు మైనస్ లో ఉంటే దాన్ని ఆర్థిక మాంద్యమేనని, ఇది కాదనలేని సత్యమని చిదంబరం అన్నారు. అంతేకాదు..

2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పాజిటివ్ రేటు నమోదవుతుందని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, మైడో త్రైమాసికానికి సంబంధించి ఇప్పటికే ఒకటిన్నర నెలలు గడిచినా, ఎకానమీ బలపడుతోందనడానికి ఎలాంటి సూచనలు, ఆధారలు లేవని చిదంబరం పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి కేంద్రం కనీస మాత్రంగానైనా ప్రయత్నించడం లేదిని, పైగా, మాద్యం లేదని కవరింగ్ ఇచ్చుకోడానికి తాపత్రయపడుతున్నదని, నిర్మల 'ఆత్మ నిర్భర్ -3' ప్రకటన అందులో భాగమేనని కాంగ్రెస్ నేత ఎద్దేవా చేశారు.

తాజాగా వెల్లడైన రిపోర్టును పేర్కొంటూ.. డీమానిటైజేషన్(పెద్ద నోట్ల రద్దు) తర్వాత నుంచి (2017 నుంచి) ఆర్థిక వ్యవస్థ దిగజారిన నేపథ్యంలో దేశంలో శిశు మరణాల రేటు 2.9 శాతం నుంచి 2018లో 3.1 శాతానికి పెరిగిందని, కేంద్రానికి ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ పరిణామాలను అర్థం చేసుకోవాలని చిదంబరం కోరారు. ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుంచి బయటపడేసేందుకు కాంగ్రెస్ తొలి నుంచీ సలహాలు, సూచనలు చేస్తున్నా మోదీ సర్కార్ పెడచెవిన పెడుతున్నదని ఆయన మండిపడ్డారు. కనీసం ఇప్పటికైనా..

షాకింగ్: ట్రంప్ ఆరోపణలు నిజమే -ఆధారాలతో విజిల్ బ్లోయర్లు -డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ అక్రమాలంటూషాకింగ్: ట్రంప్ ఆరోపణలు నిజమే -ఆధారాలతో విజిల్ బ్లోయర్లు -డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ అక్రమాలంటూ

రైతాంగాన్ని ఆదుకునేలా ఉద్యుక్తులై, పంటలకు కనీస మద్దతు ధర కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తోన్న కోట్లాది మంది పేదలకు న్యాయ్ పథకం తరహాలో నెలనెలా నగదు సహాయం అందించాలని చిదంబరం కోరారు. అదే సమయంలో ఆర్థిక అసమానాలను తగ్గిస్తూ, సంపద మొత్తం కొందరు వ్యక్తుల్లో కేంద్రీకృతం కావడాన్ని నిరోధించాలన్నారు.

English summary
Senior Congress leaders P Chidambaram and Jairam Ramesh on Thursday said the Centre’s Atmanirbhar 3 announcement today was an attempt to deflect attention from the fact that the Indian economy had entered technical recession. Former ministers P Chidambaram and Ramesh both accused the government of ignoring the starkness of the fact that the economy was in recession and working instead on headline management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X