వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హవాలా డీలర్, మాంసం ఎక్స్ పోర్ట్ కింగ్ మోయిన్ ఖురేషి అరెస్టు: రూ. 200 కోట్లు !

కోట్ల రూపాయలకు అధిపతి, మాంసం ఎగుమతిలో కింగ్, హవాలా డీలర్ మోయిన్ ఖురేషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కోట్ల రూపాయలకు అధిపతి, మాంసం ఎగుమతిలో కింగ్, హవాలా డీలర్ మోయిన్ ఖురేషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. అక్రమ హవాలా కార్యకలాపాలతో నగదు ట్రాన్స్ ఫర్ చేశారని ఆరోపిస్తూ ఢిల్లీలో మోయిన్ ఖురేషిని అదుపులోకి తీసుకున్నారు.

నేరపూరిత కుట్రలు, ఏక్యూఎం గ్రూప్ కంపెనీలు చేపడుతున్నాడని మోయిన్ ఖురేషి మీద ఆరోపణలు ఉన్నాయి. విదేశాలకు మాంసం ఎగుమతి చేసే ముసుగులో విదేశాల నుంచి హవాలా సోమ్ము బదిలి చేశారని మోయిన్ ఖురేషి మీద ఆరోపణలు రావడంతో ఆయన మీద సర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

ED arrests meat exporter Moin Qureshi money laundering case

గత అక్టోబర్ నెలలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోయిన్ ఖురేషిని అరెస్టు చేసి విచారణ చేశారు. ఆదాయపన్ను ఎగవేశారని ఇప్పటికే ఆదాయపన్ను శాఖ, సీబీఐ అధికారులు కేసు విచారణ చేస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల రూపాయల హవాలా సోమ్మును మోయిన్ ఖురేషి ట్రాన్స్ ఫర్ చేశారని ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.
విచారణ కోసం ఢిల్లీ పిలిపించిన ఈడీ అధికారులు చివరికి అరెస్టు చేసి శనివారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

English summary
The Enforcement Directorate (ED) has arrested millionaire meat exporter Moin Qureshi in connection to a Rs 200 crore money laundering case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X