వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ అరెస్ట్, సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత అదుపులోకి..

|
Google Oneindia TeluguNews

యస్ బ్యాంక్ వ్యవస్థాపకులు రానా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. డీహెచ్ఎఫ్ఎల్‌కు అక్రమంగా నగదు కేటాయించి, ప్రయోజనం పొందారనే ఆరోపణలపై శనివారం రానా కపూర్‌ను సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 20 గంటలపాటు విచారించిన తర్వాత అరెస్ట్ చేసినట్టు మీడియాకు తెలిపారు.

Recommended Video

Yes Bank Crisis: Founder Rana Kapoor Arrested in DHFL Money Laundering Case

యస్ బ్యాంకులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి రెండురోజుల నుంచి ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం సాయంత్రం ముంబైలోని నివాసంలో సోదాలు జరిపిన తర్వాత.. ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. విచారణలో తమకు సహకరించలేరని.. అందుకే అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. రానా కపూర్‌ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి.. కస్టడీకి ఇవ్వాలని కోరాతానమి పేర్కొన్నారు.

ED arrests Yes Bank founder Rana Kapoor in DHFL case after questioning

డీహెచ్ఎఫ్ఎల్ సహా ఇతర కార్పొరేట్ సంస్థలకు అందజేసిన రుణాల్లో కపూర్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యస్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం రానా కపూర్ అని ఈడీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు యస్ బ్యాంకు నుంచి విత్ డ్రా పై రిజర్వ్ బ్యాంక్ మారిటోరియం విధించిన సంగతి తెలిసిందే.

రూ.50 వేల వరకు తీసుకోవచ్చని తెలుపడంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. మరోవైపు యస్ బ్యాంక్ సహా ఇతర ఏటీఎంలలో కూడా నగదు విత్ డ్రా చేసుకోవచ్చని బ్యాంక్ ట్వీట్ చేసింది. యస్ బ్యాంక్ సంక్షోభం తర్వాత నగదు తీసుకొనేందుకు ఖాతాదారులు ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే.

English summary
Enforcement Directorate has arrested Yes Bank founder Rana Kapoor in connection with a money-laundering probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X