వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల్యాకు ఈడీ షాక్: ముంబై కోర్టులో తొలి చార్జీ షీటు.. జూలై10న శిక్ష!

ఐడీబీఐ నుంచి రూ.900కోట్లు ఎగవేతకు పాల్పడినట్లు సుమారు 6వేల పేజీలతో కూడిన చార్జీ షీట్ ను ఈడీ అధికారులు చార్జీ షీట్ లో పొందుపరిచారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: మాల్యాను ఇండియా రప్పించడం కష్టమైనా పనే అంటూ వీకె సింగ్ చేసిన వ్యాఖ్యల తర్వాత.. ఆయన విషయంలో ఇక చేతులెత్తేసినట్లేనా? అన్న అభిప్రాయం తలెత్తింది. కానీ ఈడీ దూకుడు చూస్తుంటే మాల్యాను ఎప్పటికైనా వదిలే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా విజయ్ మాల్యాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముంబై పీఎంఎల్ఏ కోర్టులో తొలి చార్జ్ షీట్ నమోదు చేసింది.

<strong>మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..</strong>మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..

ఈ మేరకు ఐడీబీఐ నుంచి రూ.900కోట్లు ఎగవేతకు పాల్పడినట్లు సుమారు 57పేజీలతో కూడిన చార్జీ షీట్ ను ఈడీ అధికారులు చార్జీ షీట్ లో పొందుపరిచారు. ఇదిలా ఉంటే, మంగళవారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరైన మాల్యాకు ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో.. చార్జీ షాట్ నమోదవడం మాల్యాకు గట్టి దెబ్బ అనే చెప్పాలి.

 ED files chargesheet against Vijay Mallya in Rs 900 cr IDBI loan case

కాగా, మాల్యాను ఇండియాకు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నాల్లో భాగంగా లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు దీనిపై విచారణ జరుపుతోంది.భారత్ తరుపున బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్(సీపీఎస్) వాదనలు వినిపిస్తోంది. దాదాపు రూ.9వేల కోట్ల రుణ ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలను విజయ్ మాల్యా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన ఆయన.. ప్రస్తుతం లండన్ లో దర్జాగా తిరుగుతున్నారు.

జూలై 10న శిక్ష ఖరారు:

రుణ ఎగవేతకు తోడు కోర్టు ధిక్కరణకు పాల్పడటం విజయ్ మాల్యాకు మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి జూలై 10న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే ఆరోజు విచారణకు మాల్యా హాజరయ్యేలా చూడాలని కోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది.

ఇంతలోనే మాల్యాను ఇండియా రప్పించడం కష్టమని వీకె సింగ్ వ్యాఖ్యానించడంతో.. విచారణకు ఆయన హాజరయ్యేది లేనిది అనుమానంగానే మారింది.

తన ఆస్తుల పూర్తి వివరాలను వెల్లడించకపోవడం ద్వారా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు, మరోవైపు కర్నాటక హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. బ్రిటిష్ సంస్థ డియాజియో నుంచి అందిన 4 కోట్ల డాలర్ల (200 కోట్ల రూపాయలకుపైగా) నిధులను తన ముగ్గురు కొడుకులకు బదిలీ చేసినందుకు మాల్యా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

English summary
India's only anti-money laundering agency Enforcement Directorate has filed a chargesheet against liquor baron Vijay Mallya in a Rs 900 loans default case concerning IDBI Bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X