బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టైర్ల వ్యాపారం: రూ. 800 కోట్ల ఆస్తులు ఎక్కడివి ? కేసు నమోదు చేసిన ఈడీ, లాకర్లు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: బెంగళూరులోని బౌరింగ్ ఇన్సిట్యూట్ క్లబ్ లో టైర్ల వ్యాపారి అవినాష్ అమర్ లాల్ కుక్రోజ్ కు చెందిన మూడు లాకర్లలో స్వాధీనం చేసుకున్న దాదాపు రూ. 800 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, ఖాళీ బ్యాంకు చెక్ లు, బాండ్లు, నగదు, బంగారు నగలు ఎక్కడివి ? అంటూ ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఈడీ దెబ్బతో అవినాష్ అమర్ లాల్ తో సంబంధాలు ఉన్న వ్యాపారులు, రాజకీయ నాయకులు హడలిపోతున్నారు.

మూడు లాకర్లు

మూడు లాకర్లు

బౌరింగ్ ఇన్సిట్యూట్ క్లబ్ లో మొత్తం 126 లాకర్లు ఉన్నాయి. లాకర్లు మరమత్తులు చెయ్యాలని, వాటిని ఖాళీ చెయ్యాలని క్లబ్ నిర్వహకులు అందరికీ లేఖలు రాశారు. అందరూ వచ్చి లాకర్లు ఖాళీ చేశారు. మూడు లాకర్లు ఉన్న అవినాష్ అమర్ లాల్ మాత్రం లాకర్లు ఖాళీ చెయ్యకుండా తప్పించుకుని తిరగడంతో క్లబ్ పరిపాలన విభాగం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల సమక్షంలో !

పోలీసుల సమక్షంలో !

పోలీసుల సమక్షంలో క్లబ్ నిర్వహకులు మూడు లాకర్లు తీశారు. అందులో రూ. 3.90 కోట్ల నగదు, రూ. 7.80 కోట్ల విలువైన బంగారు, వజ్రాల నగలు, 650 గ్రాముల బంగారు బిస్కెట్లు, రూ. 250 కోట్ల విలువైన ఖాళీ బ్యాంక్ చెక్ లు రూ. వందల కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి. పోలీసులు ఐటీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

బీజేపీ లీడర్ ఇంటిలో సోదాలు

బీజేపీ లీడర్ ఇంటిలో సోదాలు

అవినాష్ అమర్ లాల్ సొత్తు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ అధికారులు లోతుగా విచారణ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి కోరమంగలలోని బీజేపీ నాయకుడు ప్రసాద్ రెడ్డి ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఇటీవల సోదాలు చేశారు. అవినాష్ అమర్ లాల్ కు బీజేపీకి చెందిన కొందరు నాయకులకు సంబంధాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

ఆస్తి విలువ రూ. 800 కోట్లు

ఆస్తి విలువ రూ. 800 కోట్లు

బౌరింగ్ ఇన్సిట్యూట్ లోని అవినాష్ అమర్ లాలా లాకర్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ. 550 కోట్లు ఉంటుందని అధికారులు మొదట అంచనా వేశారు. తరువాత పూర్తి సమాచారం సేకరిస్తే వాటి విలువ రూ. 800 కోట్లకు పైగా ఉందని అధికారులు అంటున్నారు. ఆదాయపన్ను శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఈడీ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది.

పేరుకు టైర్ల వ్యాపారం !

పేరుకు టైర్ల వ్యాపారం !

అవినాష్ అమర్ లాల్ టైర్ల వ్యాపారం చేస్తున్నాడు. టైర్ల వ్యాపారం చేసే వ్యక్తి ఇంత భారీ మొత్తంలో ఆస్తులు ఎలా సంపాధించాడు అని అధికారులు ఆరా తీస్తున్నారు. బౌరింగ్ ఇన్సిట్యూట్ క్లబ్ లో అవినాష్ అమర్ లాల్ కు 1993 నుంచి సభ్యత్వం ఉంది. ఇటీవల అవినాష్ అమర్ లాల్ బౌరింగ్ ఇన్సిట్యూట్ లోని సభ్యత్వానికి రాజీనామా చేశారు.

English summary
Enforcement Directorate (ED) has filed a case against Bengaluru businessman Avinash who was put huge money and property documents in Bowring institute licker illegally recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X