వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీహార్ జైల్లో చిదంబరాన్ని విచారిస్తున్న ఈడీ అధికారులు .. అరెస్ట్ కు కోర్టు అనుమతి

|
Google Oneindia TeluguNews

ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. నిన్న ఆయనను విచారించేందుకు ఈడీ అధికారులకు అనుమతి మంజూరు చేసింది. ఇక దీంతో చిదంబరాన్ని విచారణ చేయడానికి ఈడీ అధికారులు తీహార్ జైలుకు చేరుకున్నారు. నేడు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, నళినీ చిదంబరం సైతం తీహార్ జైలుకు వెళ్లారు.

ఇంటి భోజనం తినాలనిపిస్తోంది: అనుమతి ఇవ్వాలంటూ చిదంబరం పిటీషన్ఇంటి భోజనం తినాలనిపిస్తోంది: అనుమతి ఇవ్వాలంటూ చిదంబరం పిటీషన్

ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో చిదంబరాన్ని విచారించడానికి ముగ్గురు వీడియో అధికారులు మంగళవారం కోర్టు అనుమతించడంతో వారు ఆయనను విచారించనున్నారు. చిదంబరం సీబీఐ జుడిషియల్ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో చిదంబరాన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకునేందుకు ఈడీకి అనుమతి మంజూరు చేసింది. తీహార్ జైల్లో విచారణ చేసేందుకు స్పెషల్ సీబీఐ జడ్జి అజయ్ కుమార్ అనుమతిచ్చారు. అవసరమైతే అరెస్ట్ చేయవచ్చని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో బుధవారం చిదంబరంను ఈడీ అధికారులు విచారించడంతో పాటుగా అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తుంది.

 ED officials interrogate chidambaram in tihar jail .. court allowed to arrest

సిబిఐ దాఖలు చేసిన ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసుల విషయంలో చిదంబరం అక్టోబర్ 17 వరకు రిమాండ్ కు తరలించారు. మరో రెండు రోజుల్లో ఇది ముగియనున్న నేపథ్యంలో మరోమారు చిదంబరాన్ని ఈడీ అధికారులు విచారించడానికి కోర్టు అనుమతినిచ్చింది. ఇక మంగళవారం చిదంబరం బెయిల్ పిటీషన్ కు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది.చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు 2007లో 305 కోట్ల విదేశీ నిధులను స్వీకరించి నందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఐ ఎన్ ఎక్స్ మీడియాకు 2017 మేలో క్లియరెన్స్ ఇచ్చినట్టు సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఆయన పై ఈడీ మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది.

English summary
One day after a Delhi court allowed the Enforcement Directorate (ED) to arrest P Chidambaram and take him into custody, ED officials reached Tihar Jail to interrogate the Congress leader. His son Karti Chidambaram and wife Nalini Chidambaram also visited Tihar jail on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X