బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జార్జ్ ను వెంటాడుతున్న ఈడీ, న్యూయార్క్ లో అక్రమ ఆస్తులు, రవికృష్ణా రెడ్డి దెబ్బకు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేజే. జార్జ్ కు కష్టకాలం ఎదురైయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేజే. జార్జ్ ను విచారణ చేసి వివరాలు సేకరించాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిర్ణయించారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేజే. జార్జ్ గతంలో మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని విదేశాల్లో భారీగా అక్రమాస్తులు సంపాధించారని ఈడీ అధికారులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైయ్యింది. కేజే. జార్జ్ మీద నమోదైన కేసు విచారణలో ఉందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీనియర్ అధికారి రమణ్ గుప్తా స్పష్టం చేశారు.

అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!

 రవికృష్ణా రెడ్డి దెబ్బ!

రవికృష్ణా రెడ్డి దెబ్బ!

మాజీ మంత్రి కేజే. జార్జ్ మంత్రిగా పని చేసే సమయంలో ఆయన అధికారం అడ్డం పెట్టుకుని విదేశాల్లో భారీగా అక్రమాస్తులు సంపాధించారని కర్ణాటక రాష్ట్ర సమితి అధ్యక్షుడు రవికృష్ణా రెడ్డి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేజే. జార్జ్ అక్రమంగా విదేశాల్లో ఆస్తులు సంపాధించారని రవికృష్ణా రెడ్డి ఆరోపిస్తున్నారు.

జార్జ్ ను వెంటాడుతున్న ఈడీ

జార్జ్ ను వెంటాడుతున్న ఈడీ

మాజీ మంత్రి, బెంగళూరు నగరంలోని సర్వజ్ఞనగర నియోజక వర్గం ఎమ్మెల్యే (కాంగ్రెస్) కేజే. జార్జ్ మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కేజే. జార్జ్ గతంలో అధికారం అడ్డం పెట్టుకుని విదేశాల్లో భారీ అక్రమ ఆస్తులు సంపాధించారని కర్ణాటక రాష్ట్ర సమితి అధ్యక్షుడు రవికృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారని సీనియర్ అధికారి రమణ్ గుప్తా చెప్పారు.

 లోకాయుక్తలో ఆస్తుల వివరాలు

లోకాయుక్తలో ఆస్తుల వివరాలు

1985 నుంచి 2019వ సంవత్సరం వరకు కేజే. జార్జ్ ఆయన ఆస్తుల వివరాలను కర్ణాటక లోకాయుక్తకు సమర్పించారు. కేజే. జార్జ్ సమర్పించిన ఆస్తుల వివరాలను లోకాయుక్త నుంచి ఈడీ అధికారులు సేకరించి విచారణ చేస్తున్నారు. కేజే. జార్జ్ కు ఎంత విలువైన ఆస్తులు ఉన్నాయో చెప్పాలని ఈడీ అధికారులు లోకాయుక్తకు చెప్పారు.

న్యూయార్క్ లో కూతురు, అల్లుడు

న్యూయార్క్ లో కూతురు, అల్లుడు

మాజీ మంత్రి కేజే. జార్జ్ కుమార్తె రేనితా అబ్రహం, అల్లుడు కెవిన్ అబ్రహం న్యూయార్క్ లో నివాసం ఉంటున్నారు. న్యూయార్క్ లోని మ్యాన్ హెటన్ లఫయట్ స్ట్రీట్ లో కేజే. జార్జ్, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ ఆస్తులు సంపాధించారని ఆరోపిస్తూ రవికృష్ణా రెడ్డి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

విచారణకు సిద్దం

విచారణకు సిద్దం

ఈడీ అధికారుల విచారణకు తాను సిద్దంగా ఉన్నానని మాజీ మంత్రి కేజే. జార్జ్ అంటున్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన కేజే. జార్జ్ తాను అధికారం అడ్డం పెట్టుకుని ఎలాంటి అక్రమ ఆస్తులు సంపాదించలేదని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు ప్రశ్నిస్తే తన పూర్తి ఆస్తుల వివరాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని కేజే. జార్జ్ అన్నారు. అక్రమ నగదు లావాదేవీలు నిర్వహించారని కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చెయ్యడంతో 48 రోజులు ఢిల్లీలోని తీహార్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించిన తరువాత బెయిల్ మీద బయటకు వచ్చారు.

English summary
New Delhi: Enforcement Directorate probing the case against former minister and Congress leader K.J.George. ED registered the complaint under Foreign Exchange Management Act, 1999 (FEMA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X