బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రబుల్ షూటర్ ఫ్రెండ్ కు ఈడీ షాక్, ఢిల్లీలో దాడులు, డైరీలో హై కమాండ్ కు ముడుపులు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఢిల్లీలోని సపర్జ్ దంగ్ ఎన్ క్లేవ్ అపార్ట్ మెంట్ లో చిక్కిన రూ. 8 కోట్ల రూపాయలకు సరైన లెక్కలు చూపించలేదని, ఆ నగదు గురించి వివరాలు చెప్పడంలో విఫలం అయ్యారని ఆరోపిస్తూ అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ సన్నిహితుల మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పంజా విసిరారు. మంగళవారం వేకువ జామున నుంచి డీకే. శివకుమార్ సన్నిహితుడు (ఫ్రెండ్) ఆంజనేయ హనుమంతయ్య ఢిల్లీలోని ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలో కాంగ్రెస్ హైకమాండ్ కు నగదు పంపించారనే వివరాలు ఉన్నాయని సమాచారం.

కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరం ఉన్న జైలు ఏషియాలో నెంబర్ వన్, రాజమండ్రి !కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరం ఉన్న జైలు ఏషియాలో నెంబర్ వన్, రాజమండ్రి !

మనీ ల్యాండరింగ్

మనీ ల్యాండరింగ్

ఢిల్లీలోని కర్ణాటక భవన్ లో అధికారిగా పని చేస్తున్న ఆంజనేయ హనుమంతయ్యకు మనీ ల్యాండరింగ్ కు సంబంధం ఉందని ఆరోపిస్తూ ఢిల్లీలోని ఆయన ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు ఆంజనేయ హనుమంతయ్య అత్యంత సన్నిహితుడు.

ఢిల్లీలో 4 ఫ్లాట్ లు

ఢిల్లీలో 4 ఫ్లాట్ లు

డీకే. శివకుమార్ కు ఢిల్లీలో నాలుగు ఫ్లాట్ లు ఉన్నాయి. డీకే. శివకుమార్ ఢిల్లీలోని ఫ్లాట్ లను శర్మా ట్రావెల్స్ కు చెందిన సుశీల్ కుమార్ శర్మా చూసుకుంటున్నారు. ఢిల్లీలోని డీకే. శివకుమార్ ఫ్లాట్ లో అధికారులు రూ. 8 కోట్లకు పైగా నగదు గుర్తించడంతో ట్రబుల్ షూటర్ చిక్కుల్లో పడ్డారు.

కాంగ్రెస్ హై కమాండ్ కు డబ్బులు ?

కాంగ్రెస్ హై కమాండ్ కు డబ్బులు ?

కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ సన్నిహితుడు రాజేంద్ర ఇంటిలో అధికారులు దాడి చేసిన సమయంలో ఓ డైరి చక్కింది. ఆ డైరీలో హైకమాండ్ (కాంగ్రెస్)కు డబ్బులు పంపించారని పూర్తి వివరాలు ఉన్నాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.

డీకే అరెస్టుకు అదే కారణం !

డీకే అరెస్టుకు అదే కారణం !

అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలోని వివరాలతో పాటు డీకే. శివకుమార్ కు అత్యంత సన్నిహితులు ఆంజనేయ హనుమంతయ్య, సచిన్ నారాయణ్, ఆంజనేయులు ఈడీ అధికారులకు ఇచ్చిన సమాచారం మేరకు ట్రబుల్ షూటర్ అరెస్టు అయ్యారు.

ఢిల్లీలో డీల్

ఢిల్లీలో డీల్

ఢిల్లీలో నగదు సరఫరా చేసే విషయంలో హనుమంతయ్య, సుశీల్ కుమార్ శర్మా పూర్తి భాద్యత వహించారని ఆరోపణలు ఉన్నాయి. మనీ ల్యాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ విచారణకు సహకరించడం లేదని ఆరోపిస్తూ ఆయన్ను ఈడీ అధికారులు ఇటీవల అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
New Delhi: Enforcement Directorate carried out searches at the residence of Anjaneya Hanumanthaiah close aide of Congress leader DK Shivakumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X