వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఇంట్లో ఈడీ సోదాలు, డీహెచ్ఎఫ్‌ఎల్‌ కేసుతో లింక్..?

|
Google Oneindia TeluguNews

యస్ బ్యాంక్ సంక్షోభం ఖాతాదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. డిపాజిటిర్ల ప్రతీ రూపాయి వెనక్కి ఇస్తామని.. బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు ఏడాదిపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయినా ఖాతాదారుల్లో ఎక్కడో అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో యస్ బ్యాంకు వ్యవస్థాపకులు రాణా కపూర్ ఇంటిపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.

Recommended Video

Yes Bank Crisis: Founder Rana Kapoor Arrested in DHFL Money Laundering Case
 ED raids Yes Bank founder Rana Kapoor house..

ముంబైలో గల రాణా కపూర్ ఇంటిలో ఈడీ దాడులు చేస్తున్నారు. రాణా కపూర్ యస్ బ్యాంకు సీఈవో, ఎండీగా పనిచేశారు. డీహెచ్ఎఫ్ఎల్ కేసుతో సంబంధం ఉందా..? లావాదేవీల విషయమై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నెలరోజుల నిషేధం ముగిసేలోపు రుణదాతలను సమకూర్చుకునే అవకాశం ఉందని ఆర్బీఐ నియమించిన యస బ్యాంకు నిర్వహకులు ప్రశాంత్ కుమార్ అభిప్రాయపడ్డారు. డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందని.. ఆందోళన చెందొద్దని ఎస్‌బీఐ మాచీ చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్ కుమార్ పేర్కొన్నారు.

డీహెచ్ఎఫ్‌ఎల్ ఇలా..
2017-18 ఆర్థిక సంవత్సరంలో 1240 కోట్ల లాభాన్ని డీఎల్‌ఎఫ్‌హెచ్ ఆర్జించింది. కానీ మరుసటి ఏడాది మాత్రం 1036 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. గతేడాది జూలైలో కంపెనీ నష్టాల్లో ఉందని ప్రకటించగానే షేర్ విలువ 30 శాతం పతనమైంది. దీంతో కంపెనీ కొలుకోలేని స్థితికి చేరుకుంది. పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఒక్కొక్కరు బయటకి రాగా.. కంపెనీ దివాలా తీసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ద్రవ్య కొరత వల్ల సమస్య వచ్చిందని, కంపెనీలో బాండ్ల రూపంలో పెట్టుబడులు పెట్టినవారికి రూ.41 వేల 800 కోట్లు అందజేశామని ఇదివరకే కపిల్ వాద్వాన్ ప్రకటించారు. కానీ ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి రావడంతో ఆయన చేతులేత్తేశారు. మరికొందరు ఇన్వెస్టర్ల ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. దీంతో డీహెచ్ఎఫ్ఎల్‌తో రాణా కపూర్ భాగస్వామ్యం ఉందా అనే అంశాలపై ఈడీ ఆరాతీస్తోంది.

English summary
ED is carrying out searches against Yes Bank former CEO & MD Rana Kapoor in connection with the DHFL case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X